Lock down: లాక్‌డౌన్‌కే మొగ్గు చూపుతోన్న‌ మెజారిటీ ప్ర‌జ‌లు.. ఆన్‌లైన్ స‌ర్వేలో ఆస‌క్తిక‌ర విష‌యాలు..

Lock down: క‌రోమా మ‌హ‌మ్మారి దేశాన్ని ఇప్ప‌ట్లో వ‌దిలేలా క‌నిపించ‌డం లేదు. రోజురోజుకీ పెరుగుతోన్న కేసులే దీనికి సాక్ష్యంగా చెప్ప‌వ‌చ్చు. ఫస్ట్ వేవ్ స‌మ‌యంలో కేసుల సంఖ్య‌ కాస్త కంట్రోల్‌లో ఉంటే సెకండ్ వేవ్...

Lock down: లాక్‌డౌన్‌కే మొగ్గు చూపుతోన్న‌ మెజారిటీ ప్ర‌జ‌లు.. ఆన్‌లైన్ స‌ర్వేలో ఆస‌క్తిక‌ర విష‌యాలు..
Lockdown In India
Follow us
Narender Vaitla

|

Updated on: May 04, 2021 | 5:49 AM

Lock down: క‌రోమా మ‌హ‌మ్మారి దేశాన్ని ఇప్ప‌ట్లో వ‌దిలేలా క‌నిపించ‌డం లేదు. రోజురోజుకీ పెరుగుతోన్న కేసులే దీనికి సాక్ష్యంగా చెప్ప‌వ‌చ్చు. ఫస్ట్ వేవ్ స‌మ‌యంలో కేసుల సంఖ్య‌ కాస్త కంట్రోల్‌లో ఉంటే సెకండ్ వేవ్ స‌మ‌యానికి వ‌చ్చేస‌రికి ఇది ఉప్పెన‌లా మారింది. దేశ వ్యాప్తంగా ఎక్క‌డ చూసినా క‌రోనా విల‌య‌తాండ‌వ‌మే క‌నిపిస్తోంది. ఆక్సిజ‌న్ అంద‌క కొంద‌రు, ఆసుప‌త్రుల్లో బెడ్స్ దొర‌క‌గా మ‌రికొంద‌రు పిట్ట‌ల్లా రాలిపోతున్నారు. అయితే ఈ ప‌రిస్థితికి అడ్డుక‌ట్ట వేయాలంటే దేశ వ్యాప్తంగా మ‌ళ్లీ లాక్‌డౌన్ విధించ‌డ‌మే మార్గ‌మ‌నే వాద‌న‌కు బ‌లం పెరుగుతోంది. కొన్ని రాష్ట్రాలు ఇప్ప‌టికే ఈ దిశ‌లో అడుగులు కూడా వేస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా లాక్‌డౌన్‌పై ప్ర‌క‌ట‌న చేస్తుంద‌ని అంద‌రూ భావించారు. కానీ అలాంటి ప్ర‌క‌ట‌న ఏది రాలేదు. దీంతో తాజాగా లాక్‌డౌన్ విధించాల‌ని చాలా మంది సూచిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవ‌ల అఖిల భార‌త వ‌ర్త‌క స‌మాఖ్య (సీఏఐటీ) చేప‌ట్టిన ఆన్ లైన్ స‌ర్వేలో 67 శాతం మంది లాక్‌డౌన్ అమ‌లు చేయాల‌ని కోర‌డం విశేషం. క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డానికి త‌క్ష‌ణ‌మే లాక్‌డౌన్ అమ‌లు చేయాల‌ని సీఏఐటీ జాతీయ అధ్య‌క్షుడు ప్ర‌వీణ్ ఖండేల్వాల్.. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి విజ్ణ‌ప్తి చేశారు. వైర‌స్ చైన్ ను బ్రేక్ చేసేందుకు దేశ‌వ్యాప్త‌ లాక్‌డౌన్ సాధ్యం కాని ప‌క్షంలో కొవిడ్-19 కేసులు అత్య‌ధికంగా వెలుగు చూస్తున్న రాష్ట్రాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించాల‌ని కోరారు. ఈ క్ర‌మంలోనే సీఏఐటీ చేప‌ట్టిన స‌ర్వేలో 9000 మందికి పైగా పాల్గొన్నాగా.. వీరిలో 67.5 శాతం మంది క‌రోనా క‌ట్ట‌డికి దేశ‌వ్యాప్త లాక్‌డౌన్ కు మొగ్గుచూపార‌ని చెప్పారు. ఇదిలా ఉంటే క‌రోనా సెకండ్ వేవ్ నియంత్రించ‌లేని విధంగా మారింద‌ని 78.2 శాతం మంది అభిప్రాయ‌ప‌డ్డారు.

Also Read: రిటైర్మెంట్ తర్వాత కూడా మీరు లక్షాధికారి కావొచ్చు..? ఈ ఒక్క పని చేస్తే చాలు.. రూపు రేఖలే మారిపోతాయి..!

మరో మహమ్మారి ప్రబలే అవకాశం..! సంచలన విషయం చెప్పిన శాస్త్రవేత్తలు.!! అసలేంటంటే.?

మే, జూన్‌ నెలల్లో ఉచిత రేషన్ సరుకులు..! మీ రేషన్ డీలర్ నిరాకరిస్తే ఇక్కడ ఫిర్యాదు చేయండి..? తెలుసుకోండి..

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..