Corona Alert: కరోనా భయంతో పదే పదే సిటీస్కాన్ చేసుకుంటున్నారా.? క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.. జాగ్రత్తా.!
Corona Alert: కరోనా మహమ్మారి యావత్ దేశాన్ని తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఏడాది గడుస్తోన్నా ఇప్పటికీ పెరుగుతోన్న కేసులు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. రోజు రోజుకు కేసుల సంఖ్య...
Corona Alert: కరోనా మహమ్మారి యావత్ దేశాన్ని తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఏడాది గడుస్తోన్నా ఇప్పటికీ పెరుగుతోన్న కేసులు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. రోజు రోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండడంతో ప్రజల్లో భయం ఎక్కువవుతోంది. ఈ క్రమంలోనే కరోనా వస్తుందేమో, వచ్చిందేమో అన్న అనుమానాలు ప్రజలను మరింత గందరగోళానికి గురి చేస్తున్నాయి. దీంతో కొద్ది లక్షణాలు కనిపించినా తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఇక ఇటీవలి కాలంలో చాతీ సిటీస్కాన్‌ల సంఖ్య భారీగా పెరిగినట్లు గణంకాలు చెబుతున్నాయి. అయితే పదే పదే సిటీ స్కాన్ చేయించుకోవడం ఎంత మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. స్వల్ప లక్షణాలు ఉంటే ఎట్టి పరిస్థితుల్లో సిటీ స్కాన్ చేయించుకోకూడదని సూచిస్తున్నారు. ఇది భవిష్యత్తులో తీవ్ర నష్టాన్ని కలిగించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ విషయాన్ని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. కొందరు కరోనా భయంతో తరచుగా సిటీస్కాన్ చేయించుకుంటున్నారని ఇది ఎంత మాత్రం మంచిది కాదని ఆయన తెలిపారు. ఈ విషయమై రణదీప్ మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో సిటీస్కాన్‌లు బాగా పెరిగాయి. ఒక్క సిటీస్కాన్ 300 నుంచి 400 చాతీ ఎక్స్‌రేలతో సమానం. అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ కమిషన్ ప్రకారం పదే పదే సిటీస్కాన్ చేయించడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తేలింది. మరీ ముఖ్యంగా తక్కువ వయసు ఉన్నవారిలో భవిష్యత్తులో క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అని ఆయన చెప్పుకొచ్చారు. చూశారుగా సిటీ స్కాన్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్నమాట.
Also Read: మహేశ్.. త్రివిక్రమ్ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ గాసిప్.. మరోసారి సూపర్ స్టార్‌కు జోడీగా ఆ హీరోయిన్ ?
కరోనా నుంచి కోలుకున్నాక ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో తెలుసా.. ఈ ఫుడ్ బలహీనతకు తగ్గిస్తుంది..
టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనున్న అలనాటి హీరోయిన్ వాణి విశ్వనాథ్ వారసురాలు.. హీరో ఎవరంటే..