AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SpiceJet: విమానయాన సంస్థ స్పైస్ జెట్ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్.. వేతనాల్లో 50 శాతం కోత.. వారికి మాత్రం మినహాయింపు!

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. వర్తక వాణిజ్యలు పూర్తిగా నిలిచిపోయాయి. రవాణా వ్యవస్థపై భారీగా ప్రభావం పడింది.

SpiceJet: విమానయాన సంస్థ స్పైస్ జెట్ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్.. వేతనాల్లో 50 శాతం కోత.. వారికి మాత్రం మినహాయింపు!
Spicejet
Balaraju Goud
|

Updated on: May 03, 2021 | 10:17 PM

Share

Coronavirus effect: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. వర్తక వాణిజ్యలు పూర్తిగా నిలిచిపోయాయి. రవాణా వ్యవస్థపై భారీగా ప్రభావం పడింది. దేశ, విదేశీ రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆదాయం తగ్గిపోయిన విమానయాన సంస్థలు దిద్దుబాటు చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ పెద్ద సంఖ్యలో ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధిస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్‌‌ నెలకు సంబంధించి.. దాదాపు 50 శాతం వరకు నిలిపివేసింది.

ఈ నేపధ్యంలో పైలట్లు, క్యాబిన్ సిబ్బంది సహా ఉద్యోగుల ఏప్రిల్ జీతం నుండి 10-50 శాతం వరకు నిలిపివేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాగా… సంసస్థ ఛైర్మన్, సీఎండీ అజయ్ సింగ్ కూడా తన ఏప్రిల్ వేతనాన్ని వదులుకోనున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా… డ్రైవర్ల తదితర జూనియర్ ఉద్యోగులకు ఏప్రిల్‌లో పూర్తి జీతం అందజేస్తున్నట్లు తెలిపింది. అయితే, తక్కువ వేతనాలున్న ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని, ఆ వర్గాలకు పూర్తి వేతన చెల్లింపులుంటాయని సంస్థ స్పష్టం చేసింది.

కాగా ‘వేతనాల్లో కోత’ అన్నది తాత్కాలిక చర్య మాత్రమేనని, పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి వచ్చిన తర్వాత… కంపెనీ నిలిపివేసిన జీతం మొత్తాన్ని తిరిగి చెల్లించనున్నామని సంస్థ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత ఆర్థిక సంక్షోభం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని వెల్లడించింది.

Read Also… Viral: ల్యాండింగ్‌కు 20 నిమిషాల ముందు విమానం అదృశ్యం.. అంతుచిక్కని రహస్యం.. కట్ చేస్తే.!

ఏపీ ప్రజలకు చంద్రబాబు డబుల్ గిఫ్ట్.. ఒకేసారి రెండు పథకాలు..
ఏపీ ప్రజలకు చంద్రబాబు డబుల్ గిఫ్ట్.. ఒకేసారి రెండు పథకాలు..
ఎంబీబీఎస్ మార్కుల లిస్ట్ షేర్ చేసిన హీరోయిన్..
ఎంబీబీఎస్ మార్కుల లిస్ట్ షేర్ చేసిన హీరోయిన్..
40 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన చిన్ననాటి స్నేహం.. జ్ఞాపకాల బస్సులో..
40 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన చిన్ననాటి స్నేహం.. జ్ఞాపకాల బస్సులో..
బంగ్లాకు మద్దతుగా పాక్.. టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?
బంగ్లాకు మద్దతుగా పాక్.. టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?
గుప్త నవరాత్రులలో.. శ్యామల దేవిని పూజిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
గుప్త నవరాత్రులలో.. శ్యామల దేవిని పూజిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
వార్నీ.. అదేంటక్కాయ్ అలా తన్నేశావ్.. కొద్దిలో ఉంటే ..
వార్నీ.. అదేంటక్కాయ్ అలా తన్నేశావ్.. కొద్దిలో ఉంటే ..
ఒకేసారి షాకిస్తూ భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు.. నేటి రేట్లు ఇవే..
ఒకేసారి షాకిస్తూ భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు.. నేటి రేట్లు ఇవే..
నువ్వేం దొంగవు రా నాయనా.. నీ తెలివి తెల్లార.. ఏం జరిగిందో..
నువ్వేం దొంగవు రా నాయనా.. నీ తెలివి తెల్లార.. ఏం జరిగిందో..
బడ్జెట్‌లో భారీ శుభవార్త చెప్పనున్న కేంద్రం.. దేశ ప్రజలందరికీ..
బడ్జెట్‌లో భారీ శుభవార్త చెప్పనున్న కేంద్రం.. దేశ ప్రజలందరికీ..
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!