Covid-19: పెరుగుతున్న కరోనా కేసులు.. ఆ జిల్లాలో మార్కెట్‌లు బంద్.. సామూహిక వివాహాలపై ఆంక్షలు..

ఓ వైపు దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెగుతోంది.. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో పలు రాష్ట్రాలు అప్రమత్తమై...

Covid-19: పెరుగుతున్న కరోనా కేసులు.. ఆ జిల్లాలో మార్కెట్‌లు బంద్.. సామూహిక వివాహాలపై ఆంక్షలు..
Coronavirus
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 26, 2021 | 2:40 PM

coronavirus cases increased: ఓ వైపు దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెగుతోంది.. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో పలు రాష్ట్రాలు అప్రమత్తమై కోవిడ్ కేసులు పెరుగుతున్న రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు కూడా విధించాయి. ఎక్కువగా.. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కేసులు నమోదవుతున్నాయి. దీంతోపాటు దేశంలో నమోదైన 90శాతం కేసుల్లో ఎక్కువగా ఏడు రాష్ట్రాల్లోనే నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదైనట్లు కేంద్రం తెలిపింది.

రాష్ట్రంలో కేసులు పెరుగుతుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. పలు జిల్లాల్లో లాక్‌డౌన్ విధించడంతోపాటు కోవిడ్ మార్గదర్శకాలను కఠినతరం చేస్తూ ఉత్తర్వులను విడుదల చేసింది. అంతేకాకుండా ఒకప్పుడు కరోనా హాట్‌స్పాట్‌గా ఉన్న ముంబై నగరంలో కోవిడ్ నిబంధనలు కఠినతరం చేసి.. మార్షల్స్‌ను సైతం మోహరించింది. ఈ క్రమంలోనే పాల్ఘర్ జిల్లాలో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో అధికారులు చర్యలు చేపట్టారు. కరోనా కట్టడికి పలు మార్గదర్శకాలను విడుదల చేస్తూ ఆదేశాలను జారీ చేశారు.

పాల్ఘర్ జిల్లాలో వారాంతపు మార్కెట్లు, సామూహిక వివాహాలను నిషేధిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో, జిల్లాలో పెరుగుతున్న కరోనావైరస్ కేసుల దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా వారాంతపు మార్కెట్లను, సామూహిక వివాహాలను నిషేధించినట్లు పాల్ఘర్ జిల్లా అధికారి శుక్రవారం వెల్లడించారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ మానిక్ గుర్సల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారని ఆయన తెలిపారు.

మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో కరోనా విస్తరణకు మార్కెట్లు, పలు కార్యక్రమాలు దోహదపడుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. అందుకే కరోనా కేసుల నివారణకు ఫిబ్రవరి 25 నుంచి జిల్లాలోని వారంతపు మార్కెట్లను, సామూహిక వివాహాలను నిషేధిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. కోవిడ్ మార్గదర్శకాలను విస్మరించినా.. ఉల్లంఘించినా కఠినమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెల్లడించారు. వివాహా, శుభకార్యాలకు నిబంధనల ప్రకారం 50మందిని అనుమతిస్తున్నట్లు తెలిపారు.

ఇదిలాఉంటే.. పాల్ఘర్ జిల్లాలో కరోనావైరస్ కేసుల సంఖ్య 45,838కు చేరుకుంది. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య 1,204 కు చేరుకుంది.

Also Read:

ఇది ట్రైలర్ మాత్రమే.. అంబానీ కుటుంబానికి దుండగుడి బెదిరింపు లేఖ.. దర్యాప్తు ముమ్మరం..

Bill Gates: బిహార్‌లోని ఓ చిన్న గ్రామంలో బిల్‌గేట్స్ కూతురు!.. కడు పేదరికంతో విద్యకు దూరమై..