AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bill Gates: బిహార్‌లోని ఓ చిన్న గ్రామంలో బిల్‌గేట్స్ కూతురు!.. కడు పేదరికంతో విద్యకు దూరమై..

Bill Gates: ప్రపంచ కుబేరులలో ఒకరైన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు, బిలియనీర్ బిల్ గేట్స్ కూతురు బిహార్ రాజధాని పాట్నా సమీపంలో ఉన్న..

Bill Gates: బిహార్‌లోని ఓ చిన్న గ్రామంలో బిల్‌గేట్స్ కూతురు!.. కడు పేదరికంతో విద్యకు దూరమై..
Shiva Prajapati
|

Updated on: Feb 26, 2021 | 1:12 PM

Share

Bill Gates: ప్రపంచ కుబేరులలో ఒకరైన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు, బిలియనీర్ బిల్ గేట్స్ కూతురు బిహార్ రాజధాని పాట్నా సమీపంలో ఉన్న దానపూర్‌లోని జంసౌత్ ముసహరి గ్రామంలో నివసిస్తోంది. అదికూడా అత్యంత కడు పేదరికంతో కనీసం చదువుకోలేని స్థితిలో జీవనం సాగిస్తోంది. బిల్ గేట్స్ కూతురు ఏంటి..? బిహార్ లోని మారుమూల గ్రామంలో ఉండటమేంటి? అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఇప్పుడు అసలు విషయంలోకి వెళదాం పదండి.

2010లో బిల్ గేట్స్ ఫౌండేషన్, బిహార్ ప్రభుత్వం మధ్య ఆరోగ్య సంస్కరణల కోసం ఒక ఒప్పందం జరిగింది. ఈ నేపథ్యంలో 23 మార్చి, 2011లో బిల్ గేట్స్ దంపతులు బిహార్‌లో రాష్ట్ర రాజధాని పాట్నాకు సమీపాన గల ముసహరి గ్రామంలో పర్యటించారు. ఆ సందర్భంగా ఒక సంవత్సరం వయసు ఉన్న రాణిని(ఇప్పుడు 11 ఏళ్లు) బిల్ ‌గేట్స్ దంపతులు దగ్గరకు తీసుకున్నారు. ఒడిలో కూర్చుపెట్టుకుని సరదాగా గడిపారు. పాలబుగ్గల ఆ చిన్నారి రాణిని చూసి సంబరపడిపోయారు. రాణిని తమ కూతురుగా భావిస్తున్నామని, దత్తత తీసుకుంటామని ప్రకటించారు. ఆ తరువాత గ్రామంలోని విశేషాలను బిల్‌గేట్స్ తెలుసుకున్నారు. గ్రామాభివృద్ధిపై ఆరా తీశారు. అనంతరం అక్కడి తిరుగు పయనం అయ్యారు.

రాణిని దత్తత తీసుకున్నారు.. అయితే, బిల్ గేట్స్ దంపతులు వచ్చారు.. వెళ్లారు.. కానీ, ఆయన చేసిన ఒక్క కామెంట్‌ను.. రాణి తల్లిదండ్రులతో పాటు ఆ గ్రామ ప్రజలు ఇంకా మర్చిపోలేదు. అదే రాణిని దత్తత తీసుకుంటామని బిల్ గేట్స్ చెప్పిన మాటను వారు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. దానపూర్‌లోని జంసౌత్ నివాసి రాణి కుమారికి సుమారు 11 సంవత్సరాలు. రాణి తల్లి కుంతి దేవి. తన చిన్న కుమార్తె రాణిని గేట్స్ దత్తత తీసుకున్నారని, స్వయంగా ఆయనే ఈ ప్రకటన చేశారని కుంతి దేవి నాటి ప్రకటనను గుర్తు చేసుకుంది.

ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. బిల్ గేట్స్ అభిమానించిన చిన్నారి రాణి వయస్సు ఇప్పుడు 11 ఏళ్లు. రాణి కుటుంబం కడు పేదరికంతో మగ్గిపోతోంది. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో విద్యకు దూరమయ్యింది. చదువుకోవాలని రాణి ఆశపడుతోంది కానీ.. చదివించే స్థోమత రాణి కుటుంబానికి లేదు. ఈ నేపథ్యంలో గతంలో బిల్ గేట్స్ రావడం, రాణిని ఎత్తుకు ఆడించడం.. తన కూతురుగా ప్రకటించడాన్ని రాణి కుటుంబ సభ్యులు సహా గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు. ఉన్నంత సేపు రాణిని అల్లారుముద్దుగా చూసుకున్నారని నాటి సన్నివేశాలను గుర్తుచేశారు. అయితే, బిల్ గేట్స్ దంపతులు ఇక్కడి నుంచి వెళ్లాక మళ్లీ రాలేదు. కనీసం బిల్ గేట్స్ ఫౌండేషన్ వారు కూడా సంప్రదించలేదు. ఇదిలాఉంటే.. ఈ గ్రామంలో రాణి మాత్రమే కాదు.. ఎంతో మంది పేదరికం కారణంగా చదువుకు దూరమవుతున్నారు. మరి రాణి విషయం బిల్ గేట్స్‌కు చేరి రెస్పాండ్ అవుతారేమో చూడాలి.

Also read:

చెక్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. అభిమానుల స్పందన ఇదే.. బొమ్మకు హిట్ టాక్.!

మీకు డయాబెటిస్ వచ్చిందని సందేహపడుతున్నారా ? ఈ లక్షణాలు మీలో ఉన్నాయెమో ఒకసారి చెక్ చేసుకోండి..