AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీకు డయాబెటిస్ వచ్చిందని సందేహపడుతున్నారా ? ఈ లక్షణాలు మీలో ఉన్నాయెమో ఒకసారి చెక్ చేసుకోండి..

సాధారణంగా మన రక్తంలో చక్కెర శాతం కొంతవరకు ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఆ చక్కెర స్థాయిలు వాటి లిమిట్ టాటి హైపర్‏గ్లీసిమియాకు దారి తీస్తుంది.

మీకు డయాబెటిస్ వచ్చిందని సందేహపడుతున్నారా ? ఈ లక్షణాలు మీలో ఉన్నాయెమో ఒకసారి చెక్ చేసుకోండి..
Rajitha Chanti
|

Updated on: Feb 26, 2021 | 12:47 PM

Share

Diabetes signs and symptoms: సాధారణంగా మన రక్తంలో చక్కెర శాతం కొంతవరకు ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఆ చక్కెర స్థాయిలు వాటి లిమిట్ టాటి హైపర్‏గ్లీసిమియాకు దారి తీస్తుంది. రక్తంలో చక్కెర ఎక్కువ కావడం వలన అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. అంతేకాకుండా ఇవి కాలేయం, మెదడు, కిడ్నీ, మరియు ఇతర ముఖ్యైమన అవయవాలపై ప్రభావం చూపిస్తుంది. డయాబెటిస్ వచ్చినట్లుగా అనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మంచింది. అలాగే మీ జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ఉత్తమం. పోషకాహరం తినడం వలన మధుమేహానికి చాలా వరకు చికిత్స చేయవచ్చు. డయాబెటిస్ వచ్చినప్పుడు మీరు రక్తంలో చక్కెర శాతాన్ని ఎలా నియంత్రిస్తారనేది మీరు తీసుకునే ఆహారం పై ఆధారపడి ఉంటుంది. అలాగే సాధ్యమైనంత వరకు వైద్యుల సలహాలు తీసుకుంటూ ఉండాలి. డాక్టర్స్ ఇచ్చిన మందులను సకాలంలో వాడాలి. ఆహారపు అలవాట్లు మార్చుకోవాల్సి ఉంటుది.

డయాబెటిస్ లక్షణాలు..

☛ యూరిన్ ప్రాబ్లమ్ : రక్తంలో ఎక్కువగా చక్కెర శాతం పెరిగినప్పుడు మీ మూత్ర పిండాలు దానిని సరిగ్గా ఫిల్టర్ చేయడంలో విఫలమవుతాయి. దీనివల్ల చెక్కర మూత్రంలో పెరుకుపోతుంది. దీంతో తరచూ యూరిన్ సమస్యను ఎదుర్కుంటారు. ఇది ఈస్ట్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు కూడా కారణమవుతుంది. బ్రాత్రుమ్ సాధారణం కంటే ఎక్కువగా వెళ్తున్నట్లుగా ఉండడం. ☛ వెంటనే బరువు తగ్గిపోవడం : శరీర బరువు ఆకస్మాత్తుగా తగ్గిపోతుంటారు. దీంతో శరీరంలో ఉండే గ్లూకోజ్ సరిగ్గా ఉత్పత్తి చేయలేకపోతుంది. దీంతో శరీరంలో ఉండే కొవ్వు శాతన్ని బర్న్ చేయడం ప్రారంభమవుతుంది. ఇక ఆకస్మాత్తుగా బరువు తగ్గుతారు. ఎలాంటి వర్క్ అవుట్స్ చేయకుండా బరువు తగ్గడం డయాబెటిస్ లక్షణమని చెప్పుకోవచ్చు. ☛ దృష్టి కోల్పోవడం: చక్కెర స్థాయిలు ఎక్కువ కావడం వలన మీ కంటి చూపు దెబ్బతింటుంది. క్రమంగా మీ కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. కంటి చూపులో మార్పులు రావడం డయాబెటిస్ లక్షణం. ☛ ఎక్కువగా నీరసం : రక్తంలో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మాములు పరిస్థితి కంటే ఎక్కువగా అలసిపోయినట్లుగా అనిపిస్తుంది. ఎక్కువగా అలసిపోయినట్లుగా అనిపిస్తే డయాబెటిస్ లక్షణం. ☛ స్కిన్ డిస్కోలరేషన్ : ఇన్సులిన్ రెసిస్టెన్స్ వలన స్కిన్ పిగ్నెంటేషన్ వస్తుంది. మెడ చుట్టూ ఉన్న చర్మంతోపాటు కాళ్ళు వాపుకు గురవుతుంటాయి. ఇవి డయాబెటిస్ లక్షణాలని చెప్పుకోవచ్చు.

Also Read:

Weight Loss Best Food: లేట్ నైట్ ఈ స్నాక్స్ తింటున్నారా ? అయితే బరువు పెరిగే ఛాన్స్.. బెస్ట్ స్నాక్స్ ఏమిటంటే..