Weight Loss Best Food: లేట్ నైట్ ఈ స్నాక్స్ తింటున్నారా ? అయితే బరువు పెరిగే ఛాన్స్.. బెస్ట్ స్నాక్స్ ఏమిటంటే..
లైట్ నైట్ స్నాక్స్ మీరు బరువు తగ్గాలనుకునే కళలను పూర్తిగా చిధ్రం చేస్తాయి. రోజులో మీరు తీసుకునే ఆహారం అర్ధరాత్రి సమయంలో తినాలపించే
Weight Loss Best Food: లైట్ నైట్ స్నాక్స్ మీరు బరువు తగ్గాలనుకునే కళలను పూర్తిగా చిధ్రం చేస్తాయి. రోజులో మీరు తీసుకునే ఆహారం అర్ధరాత్రి సమయంలో తినాలపించే కోరికలపై ప్రభావం చూపుతుంది. ఇక లాక్ డౌన్ ప్రభావంతో చాలా మంది ఇంటి నుంచే పని చేస్తున్నారు. ఈక్రమంలో వారి ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చివేసింది. అలాగే కొందరికి అర్థరాత్రిళ్ళు ఏదోకటి తినడం అలవాటుంటుంది. అయితే ఆసమయంలో తీనాల్సిన పదార్థాల వలన బరువు హెచ్చుతగ్గులలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఉదయం, రాత్రి మనం తీసుకునే ఆహారం బరువు పెంచడం లేదా తగ్గించడంపై ప్రభావం చూపిస్తుంది. అలాగే కొన్ని రకాల పదార్థాలను రాత్రిళ్లు తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలను నివారించడంలో తొడ్పడతాయి.
ప్రస్తుత జీవన విధానంతోపాటు తీసుకునే ఆహార పదార్థాల మొత్తం ప్రభావం అర్థరాత్రిసమయంలో కలిగే ఆకలి కోరికలను నివారించడంలో సహయపడుతుంది. ఇక మీకు రాత్రి పూట చాలా ఆకలి వేసినట్టుగా అనిపిస్తే కొన్ని రకాల పదార్థాలను ఎంచుకోవాల్సి ఉంది. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రాత్రి సమయంలో తినాల్సిన పదార్థాలు…
☛ పాప్ కార్న్: ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇందులో ధాన్యం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వలన సంతృప్తి కలగడమే కాకుండా తక్కువగా తినేలా చేస్తాయి.
☛ ఓట్ మీల్: ఓట్ మీల్ అనేది ఫైబర్ లోడ్ చేసిన భోజనం. కొంచెం తినగానే పూర్తిగా తిన్న అనుభవం కలుగుతుంది. దీంతో మీరు తక్కువగా తినేందుకు సహయపడుతుంది.
☛ హెర్బల్ టీ: హెర్పల్ టీలు ప్రకృతి పరంగా రెడి చేయబడ్డాయి. వీటిని తీసుకోవడం వలన మంచి నిద్రకు సహయపడతాయి. అలాగే కెఫిన్ లేని టీని ఎంచుకోవడం ఉత్తమం.
☛ గ్రీకు పెరుగు: మీరు రెగ్యులర్ హోం సెట్ పెరుగు లేదా పెరుగును తీసుకోవచ్చు. ఇది మీకు ప్రోటీన్, కాల్షియాన్ని అందిస్తుంది. అలాగే తక్కువ తినడానికి సహయపడుతుంది.
రాత్రి సమయంలో తినకూడని పదార్థాలు..
☛ పిజ్జా: పిజ్జాలో ఉండే గ్రీజ్ గుండెల్లో మంటను కలిగిస్తుంది. అలాగే కేలరీలను కూడా ఎక్కువగా కలిగి ఉంటుంది. ☛ కార్న్ ఫేక్స్ లేదా తీపి పదార్థాలు: ఇవి ఎక్కువగా కేలరీలను కలిగి ఉంటాయి. అలాగే రాత్రిళ్ళు ఆకలిని తగ్గించలేవు. ☛ కుకీలు, చాక్లెట్లు: ఈ పదార్థాలను తినాలని కోరికలను నియంత్రించుకోవాలి. ఇందులో ఎక్కువగా తీపి శాతం ఉంటుంది. ఇవి తినడం వలన నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. ☛ ఐస్ క్రీం: ఇందులో ఎక్కువగా కొవ్వు శాతం, చక్కెర శాతం ఎక్కువగా ఉండడం వలన నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. ☛ చిప్స్: ఇందులో వ్యర్థమైన కొవ్వు శాతం అధికంగా ఉండడం వలన అనారోగ్య సమస్యలను కలిగిస్తాయి.
Also Read: