Dandruff Tips: చుండ్రు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా ? ఈ ట్రిక్స్ ఫాలో అయితే రిజల్ట్ పక్కా…
చాలా మానసికంగా వేధించే సమస్య జుట్టు రాలడం. ఇందుకు ప్రధాన కారణాలు సరైన పోషకాహర లోపం, చుండ్రు, విటమిన్ లోపం ఉండడం.
Home remedies for dandruff treatment: చాలా మానసికంగా వేధించే సమస్య జుట్టు రాలడం. ఇందుకు ప్రధాన కారణాలు సరైన పోషకాహర లోపం, చుండ్రు, విటమిన్ లోపం ఉండడం. అయితే ఇందులో ప్రధానంగా చుండ్రు సమస్య వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టెస్తుంది. అయితే ఈ చుండ్రు సమస్యను తగ్గించుకోవడానికి అనేక రకాల ప్రయాత్నాలు చేస్తుంటారు. అలాగే రకరకాల ట్రీట్మెంట్స్ గురించి ఎంక్వైరీ చేస్తుంటారు. అలాగే ఇంట్లోనే అనేక రకాల టిప్స్ ఫాలో అవుతుంటారు. ఇక చుండ్రు సమస్యను తగ్గించుకోవడానికి వంటింట్లో ఉండే పదార్థాలు సహయపడతాయి. అవెంటో తెలుసుకుందామా..
☛ ఒక ప్యాన్లో గ్రీన్ టీ ఆకుల్ని పదిహేను నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత మిశ్రమాన్ని చల్లార్చి.. అనంతరం దానిని మాడుపై నెమ్మదిగా రాయాలి. ఇలా సుమారు ముప్ఫై నిమిషాలు మర్ధన చేయాలి. ఆ తర్వాత హెయిర్ వాష్ చేయాలి. ఇందుకోసం గ్రీన్ టీ బ్యాగ్స్ కూడా వాడోచ్చు.
☛ ఒక నిమ్మకాయ రసం తీసుకోని.. నెమ్మదిగా మాడుపై రాస్తూ ఉండాలి. ఇలా దాదాపు పదిహేను ఇరవై నిమిషాలు మర్ధన చేయాలి. ఆ తర్వాత హెయిర్ వాష్ చేయాలి. ఇలా క్రమంగా చేయడం వలన చుండ్రు సమస్య తగ్గుతుంది.
☛ రీటా ఫౌడర్ పేస్ట్ తీసుకొని మీ స్కాల్ఫ్ కి పట్టించాలి. రెండు గంటలపాటు ఉంచి ఆ తర్వాత చల్లని నీటితో కడిగేసి షాంపుతో చేసుకోవాలి. ఇలా చేయడం వలన చుండ్రు సమస్య తగ్గుతుంది.
☛ రోజ్ మేరీ ఆయిల్, వెనిగల్ కలిపి మాడుకు పట్టించాలి. దీనిని పదిహేను నిమిషాలు ఉంచి.. ఆ తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి.
☛ నిమ్మకాయ తొక్కలని నీటిలో ఇరవై నిమిషాల పాటు మరిగించాలి. దీనిని కాసేపు చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. దీంతో వారానికి ఒకసారి హెయిర్ వాష్ చేసుకోవడం వలన చుండ్రు సమస్య తగ్గుతుంది.
☛ మెంతుల్ని రాత్రంతా నానబెట్టి ఆ మరుసటి రోజు పేస్ట్ గా మార్చాలి. ఈ పేస్ట్ ను తలకు ముప్ఫై నిమిషాలు పట్టించాలి. ఆ తర్వాత చల్లని నీటితో హెయిర్ వాష్ చేసుకోవాలి.
☛ వెనిగర్, వాటర్ రెండు సమాన భాగల్లో తీసుకోని కలపాలి. దీనిని మాడుకు అప్లై చేసి రాత్రంత వదిలేయాలి. మరుసటి రోజు ఉదయాన్నే మైల్డ్ బేబీ షాంపూతో వాష్ చేయడం వలన చుండ్రు సమస్య తగ్గుతుంది.
☛ నీటినీ యాపిల్ సైడర్ వెనిగర్ నీ సమాన భాగాలుగా తీసుకుని స్ప్రే బాటిల్ లో వేసి మీ స్కాల్ప్ మీద స్ప్రే చేయండి. ఆ తరువాత మీ తలకి ఒక టవల్ చుట్టి పదిహేను నిమిషాలు ఉంచండి. మామూలుగా హెయిర్ వాష్ చేసేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేయవచ్చు.
☛ రోజూవారీ హెయిర్ వాష్ చేసిన తరువాత ఆల్కహాల్ బేస్డ్ మౌత్ వాష్ తో ఒక సారి హెయిర్ రిన్స్ చేయండి. ఆ తరువాత కండిషనర్ యూజ్ చేయండి.
☛ రెండు యాస్ప్రిన్ టాబ్లెట్స్ పొడి కొట్టి మీరు హెయిర్ వాష్ చేయబోయే ముందు వాటిని మీ షాంపూలో కలిపి హెయిర్ వాష్ చేయండి. ఆ తరువాత ప్లెయిన్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోండి.
Also Read:
Henna Benefits: గోరింటాకుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజలున్నాయి.. అందంతోపాటు ఆరోగ్యానికి మేలు చేస్తుందట..
కీబోర్డు టైప్ చేస్తుంటే కీళ్ల నొప్పి వేధింస్తుందా ? ఈ సింపుల్ హ్యాండ్ ఎక్సర్సైజ్ చేసి చూడండి..