ఇది ట్రైలర్ మాత్రమే.. అంబానీ కుటుంబానికి దుండగుడి బెదిరింపు లేఖ.. దర్యాప్తు ముమ్మరం..

Mukesh Ambani: ముంబైలోని ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ నివాసం యాంటిలియా దగ్గర పేలుడు పదార్థాలున్న కారు లభ్యమైన సంగతి..

  • Shaik Madarsaheb
  • Publish Date - 1:14 pm, Fri, 26 February 21
ఇది ట్రైలర్ మాత్రమే.. అంబానీ కుటుంబానికి దుండగుడి బెదిరింపు లేఖ.. దర్యాప్తు ముమ్మరం..

Mukesh Ambani: ముంబైలోని ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ నివాసం యాంటిలియా దగ్గర పేలుడు పదార్థాలున్న కారు లభ్యమైన సంగతి తెలిసిందే. జిలెటిన్ స్టిక్స్‌ ఉన్న ఈ కారును పోలీసులు గురువారం రాత్రి స్వాధీనం చేసుకొని పలు వివరాలను వెల్లడించారు. అయితే ఈ కారులో ఉన్న నంబర్‌ ప్లేట్లలో కొన్ని ముఖేశ్‌ అంబానీ భద్రతా బృందంలో ఉపయోగించే వాహనాల్లో ఉన్న నంబర్‌ ప్లేట్లతో మ్యాచ్‌ అయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే స్కార్పియోలో ఆగంతకుడు రాసిన లేఖ కూడా పోలీసులకు దొరికింది. దీనికి సంబంధించి పోలీసులు శుక్రవారం పలు వివరాలను వెల్లడించారు.

ఈ లేఖలో.. ముఖేష్ అంబానీ కుటుంబాన్ని బెదిరిస్తూ.. దుండగుడు రాశాడు. ఈ పేలుడు పదార్థాలున్న కారును మీ ఇంటి సమీపంలో వదిలివేయడం కేవలం ట్రైలర్ మాత్రమేనంటూ లేఖలో రాశాడు. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ కుటుంబానికి ఇది ఒక అదృష్టమని, మరోసారి పేలుడు పదార్థాలు మీ వద్దకే వస్తాయంటూ దుండగుడు కారులో వదిలిన వెళ్లిన లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ముఖేష్ అంబానీ నివాసముంటున్న ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అంతేకాకుండా యాంటిలియా భవనానికి ఇరువైపులా పోలీసులను మోహరించారు. అయితే ఈ కేసును ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

కోజికోడ్ రైల్వేస్టేషన్‌లో పేలుడు పదార్థాల కలకలం.. 100 జిలెటిన్ స్టిక్స్, 350 డిటోనేటర్లు స్వాధీనం

Mukesh Ambani: ముఖేష్ అంబానీ బంగ్లా సమీపంలో అనుమానాస్పద కారు.. అప్రమత్తమైన పోలీసులు.. కుట్రకు పన్నాగం..?