India Covid-19: ఆ 12 రాష్ట్రాల్లోనే కరోనా కేసులు అధికం.. మరికొన్ని రాష్ట్రాల్లో తగ్గుతున్నాయ్.. కేంద్రం
India Coronavirus: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం కొనసాగుతూనే ఉన్నది. గత రెండు రోజుల నుంచి వరుసగా నాలుగు లక్షలకుపైగానే
India Coronavirus: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం కొనసాగుతూనే ఉన్నది. గత రెండు రోజుల నుంచి వరుసగా నాలుగు లక్షలకుపైగానే కొత్త కేసులు నమోదవుతుండగా.. మూడు వేలమందికి పైగా బాదితులు ప్రాణాలు కోల్పోతున్నారు. దీందో పలు రాష్ట్రాల్లో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కర్ఫ్యూ, లాక్‌డౌన్ విధించినప్పటికీ.. కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్, హర్యానా, బీహార్‌లోనే కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ 12 రాష్ట్రాల్లోనే భారీగా కేసులు వెలుగులోకి వస్తున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి ఆర్తి అహుజా శుక్రవారం వెల్లడించారు.
అయితే.. మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఇటీవల కేసులు బాగా పెరిగి.. మళ్లీ క్రమంగా తగ్గుతున్నాయని ఆర్తి అహుజా వివరించారు. పంజాబ్, జమ్ముకశ్మీర్, అస్సాం, హిమాచల్‌ప్రదేశ్, పుదుచ్చేరి, మేఘాలయా, త్రిపుర, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్ రోజూవారీ కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుందని.. తెలిపారు. గతంలో నమోదైన గణాంకాలను పరిశీలిస్తే.. కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, బీహార్, హర్యానా, ఒడిశా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కేసులు బాగా పెరుగుతున్నాయని ఆర్తి అహుజా తెలిపారు.
ఇదిలాఉంటే.. దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొసాగుతుందని ఆర్తి ఆహుజా వివరించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 16.50 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు ఆమె తెలిపారు. కాగా.. 18-44 ఏండ్ల మధ్య వయస్సు ఉన్న వారికి కూడా ఇప్పటివరకు 11.81 లక్షల డోసుల టీకాలు ఇచ్చినట్లు వివరించారు.
Maharashtra, Karnataka, Kerala, Uttar Pradesh, Rajasthan, Andhra Pradesh, Gujarat, Tamil Nadu, Chhattisgarh, West Bengal, Haryana and Bihar have a high caseload: Arti Ahuja, Additional Secretary (Health) #COVID19 pic.twitter.com/yi8H6Qp5Mj
— ANI (@ANI) May 7, 2021
Also Read: