AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో మే 21 వరకు లాక్‌డౌన్ పొడిగింపు‌..?

దేశంలో కరోనా వైరస్ కేసుల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని లాక్ డౌన్‌ను మరో రెండు వారాలు అనగా మే 17 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రెడ్, కంటోన్మెంట్ జోన్లు మినహాయించి.. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో పలు సడలింపులను ఇచ్చింది. అయితే ఇప్పుడు అందరిలోనూ తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేసీఆర్.. జనతా కర్ఫ్యూ దగ్గర నుంచి లాక్ […]

తెలంగాణలో మే 21 వరకు లాక్‌డౌన్ పొడిగింపు‌..?
Ravi Kiran
|

Updated on: May 04, 2020 | 3:20 PM

Share

దేశంలో కరోనా వైరస్ కేసుల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని లాక్ డౌన్‌ను మరో రెండు వారాలు అనగా మే 17 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రెడ్, కంటోన్మెంట్ జోన్లు మినహాయించి.. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో పలు సడలింపులను ఇచ్చింది. అయితే ఇప్పుడు అందరిలోనూ తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేసీఆర్.. జనతా కర్ఫ్యూ దగ్గర నుంచి లాక్ డౌన్ వరకు అన్నీ నిర్ణయాలు కూడా పకడ్బందీగా తీసుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే రాష్ట్రంలో లాక్ డౌన్‌ను మే 7 వరకు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక మరోసారి ఈ లాక్‌డౌన్‌ను పొడిగిస్తారా.? లేదా.? అన్నదే హాట్ టాపిక్.

తాజాగా అందుతున్న సమాచారం తెలంగాణలో మరోసారి రెండు వారాల పాటు లాక్ డౌన్‌ను పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం అమ్మకాలకు కేసీఆర్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. అటు ఈ రెండు జోన్లలో రవాణా సౌకర్యాలతో పాటు ఇతర సడలింపులు విషయంపై కూడా చర్చించారట. రాష్ట్రంలో కరోనా పరిస్థితి, లాక్ డౌన్ పొడిగింపు విషయాలపై సీఎం కేసీఆర్ ఆదివారం సుదీర్ఘమైన సమీక్ష నిర్వహించారు. దేశవ్యాప్త లాక్ డౌన్‌ను కేంద్రం మరోసారి పొడిగించిన నేపధ్యంలో రాష్ట్రంలో కూడా మరో రెండు వారాల పాటు కొనసాగించాలని సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమైనట్లు సమాచారం. కంటైన్మెంట్‌ జోన్లలో క్వారంటైన్‌ గడువు ఈ నెల 21తో ముగియనుండటంతో.. దీన్ని పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అటు కేంద్రం జారీ చేసిన లాక్ డౌన్ సడలింపుల విషయంపై కూడా ప్రధానంగా చర్చించారని టాక్. మరోవైపు వలస కూలీల తరలింపులపై కూడా చర్చించారు.

కాగా, రేపు జరగబోయే కేబినేట్ సమావేశంపై అందరి దృష్టి నెలకొంది. కేబినేట్ భేటిలో చర్చించాల్సిన అంశాలపై ఎజెండాను ఖరారు చేసేందుకు సోమవారం మరోసారి భేటి కావాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది. లాక్‌డౌన్‌ పొడిగింపు, సడలింపులు, పాటించాల్సిన మార్గదర్శకాలను సిద్ధం చేయాలని అధికారులను ఆయన ఆదేశించినట్లు సమాచారం. చూడాలి మరి ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయో.?

Read More: 

నేటి నుంచి ఏపీలో మద్యం షాపులు ఓపెన్.. టైమింగ్స్ ఇవే..

జగన్ సర్కార్ సంచలనం.. ఇకపై ఇంటర్ ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగం..

వారిని మాత్రమే తరలించాలి.. కేంద్రం క్లారిటీ..

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ 3.0.. తెరుచుకునేవి ఇవే..