కాజోల్‌కు క‌రోనా పాజిటివ్ ! ఇద్ద‌రూ బాగానే ఉన్నారు : అజయ్ దేవగణ్

బాలీవుడ్ నటి కాజోల్‌కు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అంతేకాదు ఆమె కూతురు నైసాకు కూడా వైరస్ సోకిందన్న వార్త‌లు ..

  • Jyothi Gadda
  • Publish Date - 4:46 pm, Tue, 31 March 20
కాజోల్‌కు క‌రోనా పాజిటివ్ ! ఇద్ద‌రూ బాగానే ఉన్నారు : అజయ్ దేవగణ్
బాలీవుడ్ నటి  కాజోల్‌కు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అంతేకాదు ఆమె కూతురు నైసాకు కూడా వైరస్ సోకిందన్న వార్త‌లు వినిపించాయి. దీంతో ఈ వార్తలపై బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ స్పందించాడు. త‌న‌ ట్విట్టర్ వేదికగా వారి ఆరోగ్య స‌మాచారం పోస్టు చేశారు.
కాజోల్‌, ఆమె కూతురు నైసా ముంబై ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తున్న ఫొటోలు వైరల్‌ అయ్యాయి. సింగపూర్‌లో విద్యనభ్యసిస్తున్న నైసాను రిసీవ్‌ చేసుకోవడానికి కాజోల్‌ అక్కడికి వెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న తరుణంలో నైసా ప్రాణాంతక వైరస్‌ బారిన పడ్డారని.. కాజోల్‌కు కూడా ప్రమాదం పొంచి ఉందంటూ వదంతులు వ్యాపించాయి. ఈ రూమర్లపై స్పందించిన అజయ్‌ దేవ్  గన్.. ‘‘మీరు ఈ విషయం గురించి అడుగుతున్నందుకు ధన్యవాదాలు. కాజోల్‌, నైసా బాగున్నారు. వారి ఆరోగ్యం గురించి ప్రచారం అవుతున్న పుకార్లు అవాస్తవాలు. నిరాధారమైనవి’’అని ట్విటర్‌లో స్పష్టం  చేశారు.