AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షాకింగ్.. సహాయకుడికి కరోనా పాజిటివ్‌.. సెల్ఫ్ క్వారంటైన్‌లోకి ప్రధాని..

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. ఇప్పటికే వేల సంఖ్యలో ప్రాణాలను బలిగొంది. దీనికి కులం, మతం, భాష, ప్రాంతం.. చిన్న, పెద్ద.. పేద, ధనిక అన్న తేడాలేమీ లేవు. ఈ వైరస్‌కు అంతా ఒక్కటే. ఇప్పటికే బ్రిటన్, స్పెయిన్‌ దేశాలను వణికిస్తున్న ఈ మహమ్మారి.. ఇరాన్, ఇజ్రాయిల్‌లను కూడా అదే రేంజ్‌లో వణికిస్తోంది. తాజాగా ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహు సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ఆయన కార్యాలయ అధికారులు తెలిపారు. ప్రధాని నెతన్యూహు […]

షాకింగ్.. సహాయకుడికి కరోనా పాజిటివ్‌.. సెల్ఫ్ క్వారంటైన్‌లోకి ప్రధాని..
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 31, 2020 | 4:59 PM

Share

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. ఇప్పటికే వేల సంఖ్యలో ప్రాణాలను బలిగొంది. దీనికి కులం, మతం, భాష, ప్రాంతం.. చిన్న, పెద్ద.. పేద, ధనిక అన్న తేడాలేమీ లేవు. ఈ వైరస్‌కు అంతా ఒక్కటే. ఇప్పటికే బ్రిటన్, స్పెయిన్‌ దేశాలను వణికిస్తున్న ఈ మహమ్మారి.. ఇరాన్, ఇజ్రాయిల్‌లను కూడా అదే రేంజ్‌లో వణికిస్తోంది.

తాజాగా ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహు సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ఆయన కార్యాలయ అధికారులు తెలిపారు. ప్రధాని నెతన్యూహు సహాయకుడికి కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తేలడంతో.. ముందస్తు జాగ్రత్తగా ప్రధాని క్వారంటైన్‌లో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇజ్రాయిల్‌లో ఈ వైరస్‌ వేగంగా వ్యాపిస్తుండటంతో దేశమంతటా లాక్‌డౌన్‌  విధించింది ప్రభుత్వం. అక్కడి ప్రజలను వారి వారి ఇళ్ల నుంచి,, కనీసం 100 మీటర్లు మించి బయటకు రానివ్వడంలేదు. కేవలం ఆహార పదార్ధాలను తెచ్చుకునేందుకు మాత్రమే ప్రజలను అనుమతిస్తున్నారు.

కాగా.. ప్రస్తుతం అక్కడ 4347 మంది కరోనా బారినపడగా, 134 మంది తిరిగి కోలుకున్నారు. మరో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 95 మంది తీవ్ర అస్వస్ధతతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు అక్కడి వైద్యాధికారులు తెలిపారు.

Follow Us
ఫ్రెండ్స్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారా..? ఐటీ రూల్స్ ఇవే..
ఫ్రెండ్స్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారా..? ఐటీ రూల్స్ ఇవే..
సిండికేట్ ఉచ్చులో రొయ్య సాగు.. దిక్కుతోచని స్థితిలో ఆక్వా రైతు
సిండికేట్ ఉచ్చులో రొయ్య సాగు.. దిక్కుతోచని స్థితిలో ఆక్వా రైతు
చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లోడు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో..
చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లోడు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో..
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన..
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన..
జీలకర్ర నీరు లేదా వాము నీరు.. ఖాళీ కడుపుతో తాగేందుకు ఏది బెస్ట్..
జీలకర్ర నీరు లేదా వాము నీరు.. ఖాళీ కడుపుతో తాగేందుకు ఏది బెస్ట్..
ఆరోగ్యంగా ఉండటానికి ఏసీ టెంపరేచర్ ఎంత ఉండాలంటే!
ఆరోగ్యంగా ఉండటానికి ఏసీ టెంపరేచర్ ఎంత ఉండాలంటే!
అతడు పెద్ద హీరో.. కానీ నాతో ఆ మాట చెప్పడంతో షాకయ్యా..
అతడు పెద్ద హీరో.. కానీ నాతో ఆ మాట చెప్పడంతో షాకయ్యా..
ముద్దు పెట్టేటప్పుడు కళ్లు మూసుకోవడానికి కారణం తెలుసా?
ముద్దు పెట్టేటప్పుడు కళ్లు మూసుకోవడానికి కారణం తెలుసా?
తక్కువ సమయంలోనే ఎంతో రుచికరంగా చేసుకునే ఇన్‌స్టంట్ రెసిపీ ఇదీ!
తక్కువ సమయంలోనే ఎంతో రుచికరంగా చేసుకునే ఇన్‌స్టంట్ రెసిపీ ఇదీ!
తొడలు, పిక్కలను బలంగా మార్చే 5 అదిరిపోయే వ్యాయామాలు ఇవే!
తొడలు, పిక్కలను బలంగా మార్చే 5 అదిరిపోయే వ్యాయామాలు ఇవే!