Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: దేశంలో ఇంకా ముగియని సెకండ్ వేవ్.. వ్యాక్సిన్ పంపిణీ విషయంలో మాత్రం రికార్డ్.. కీలక వివరాలు

ఆ నాలుగు స్టేట్సే కొంప ముంచుతున్నాయి. కేవలం అక్కడ నమోదవుతున్న కేసులే ఆందోళన కలిగిస్తున్నాయి. రెండు నెలలుగా కోవిడ్ ఎఫెక్ట్ చూస్తే..

Coronavirus: దేశంలో ఇంకా ముగియని సెకండ్ వేవ్.. వ్యాక్సిన్ పంపిణీ విషయంలో మాత్రం రికార్డ్.. కీలక వివరాలు
India Corona Updates
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 02, 2021 | 6:34 PM

ఆ నాలుగు స్టేట్సే కొంప ముంచుతున్నాయి. కేవలం అక్కడ నమోదవుతున్న కేసులే ఆందోళన కలిగిస్తున్నాయి. రెండు నెలలుగా కోవిడ్ ఎఫెక్ట్ చూస్తే.. పాజిటివ్ కేసులు నమోదవుతున్న జిల్లాల సంఖ్య నాల్గో వంతుకు పడిపోతున్నా..భయం మాత్రం అంతకంతకు పెరుగుతోంది. దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత తగ్గినట్లు కనిపిస్తున్నా….కొన్ని రాష్ట్రాల్లో మాత్రం వైరస్ పీడ వదలడం లేదు. ప్రధానంగా కేరళ, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో గడిచిన రెండు నెలల్లో కేసులు నమోదవుతున్న జిల్లాలను ప్రత్యేకంగా గుర్తించింది కేంద్రం ఆరోగ్యశాఖ. జూన్‌ నెలలో దేశంలోని మొత్తం 279 జిల్లాల్లో రోజుకు వందకుపైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు వెల్లడించింది. ఆగస్ట్ నెల వచ్చే సరికి.. 42 జిల్లాల్లో మాత్రమే రోజుకు వందకుపైగా కేసులు నమోదైనట్లు పేర్కొంది.

కరోనా విషయంలో గత కొద్దిరోజుల నుంచి కేరళ రాష్ట్రం తెగ కలవరపెడుతోంది. ఇక్కడ ప్రస్తుతానికి లక్షకుపైగా యాక్టివ్ కేసులున్నాయి. వారం, పది రోజులుగా రోజుకు పాతిక వేలకు తగ్గకుండా పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఆతర్వాత మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, ఏపీలో కూడా కేసుల సంఖ్య ఎక్కువగానే ఉన్నాయి. ఈ నాలుగు రాష్ట్రాల్లో 10 వేల నుంచి లక్ష వరకు యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇక వ్యాక్సినేషన్‌ విషయంలో రెండు డోసులు పూర్తి చేసుకున్న వారి శాతం 16 ఉంటే…సింగిల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 54 శాతానికి చేరినట్లు కేంద్రం ప్రకటించింది. 2021 ఆగస్టు నెలలో 18.38 కోట్ల వ్యాక్సిన్ డోసులను అందించినట్లు వెల్లడించింది. కాగా కరోనా సెకండ్ వేవ్ భారత్‌‌లో ఇంకా ముగియలేదని కేంద్రం పేర్కొంది.

సీ.1.2  కొత్త వేరియంట్​తో​ మరింత డేంజర్

ఇటీవల దక్షిణాఫ్రికా సైంటిస్టులు కొత్త రకం కరోనా వేరియంట్​ను గుర్తించారు. సీ.1.2గా పిలిచే ఈ రకం సింగిల్​ వైరస్​ కాదు.. జన్యుక్రమాలు సారూప్యంగా ఉన్న వైరస్​ల సమూహం. ఈ వేరియంట్​పై ఇంకా పూర్తి స్థాయిలో అధ్యయనం జరగలేదు కానీ.. వ్యాప్తి ప్రమాదకరంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి మ్యుటేషన్​ రేటూ ఎక్కువే అని వెల్లడించారు. అంటే.. తక్కువ కాలవ్యవధిలో ఎక్కువ మ్యుటేషన్లు బయటపడుతున్నాయని అర్థమవుతుంది.  నిజానికి.. వైరస్​ల స్వభావం అదే. నిరంతరం పరిణామం చెందుతూనే ఉంటాయి. మార్పులు సంభవిస్తూనే ఉంటాయి. అయితే.. సీ.1.2 ను ఇతర వేరియంట్లతో పోల్చి చూడటం తొందరపాటే అవుతుందని పరిశోధకులు అంటున్నారు.

Also Read: ఏపీలో కొత్తగా 1,378 కరోనా వ్యాప్తి.. ఆ 2 జిల్లాల్లో ప్రమాదకరంగా వైరస్ వ్యాప్తి

 బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా గృహప్రవేశం.. తెల్లారి నిద్రలేచి చూసేసరికి మైండ్ బ్లాంక్