Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Corona Cases: తెలంగాణలో శాంతించిన కరోనా మహమ్మారి.. కొత్తగా నమోదైన కేసుల వివరాలు ఇలా..

తెలంగాణలో కరోనా మహమ్మారి గతంలో కంటే ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. ఒకప్పుడు వేలాదిగా నమోదయ్యే కేసులు ప్రస్తుతం 400లోపు నమోదు అవుతున్నాయి.

Telangana Corona Cases: తెలంగాణలో శాంతించిన కరోనా మహమ్మారి.. కొత్తగా నమోదైన కేసుల వివరాలు ఇలా..
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 02, 2021 | 8:09 PM

Telangana Corona: తెలంగాణలో కరోనా మహమ్మారి గతంలో కంటే ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. ఒకప్పుడు వేలాదిగా నమోదయ్యే కేసులు ప్రస్తుతం 400లోపు నమోదు అవుతున్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 313 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇద్దరు మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 6,58,689 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, మొత్తం 3,878 మంది మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజాగా రాష్ట్రంలో కరోనా నుంచి 354 మంది కోలుకోగా, ఇప్పటి వరకు 6,49,002 మంది కోలుకున్నారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతం ఉండగా, దేశంలో 1.3 శాతం ఉంది. రాష్ట్రంలో కోలుకున్నవారి రేటు 98.52 శాతం ఉండగా, దేశంలో 97.45 శాతం ఉంది. రాష్ట్రంలో మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 5,809 ఉంది.

తాజాగా జిల్లాల వారీగా నమోదైన పాజిటివ్‌ కేసులు:

ఆదిలాబాద్‌- (ఎలాంటి కేసులు లేవు), భద్రాది కొత్తగూడెం -5, జీహెచ్‌ఎంసీ -77, జగిత్యాల-12, జనగామ-2, జయశంకర్‌ భూపాలపల్లి- 2, జోగులాంబ గద్వాల -2, కామారెడ్డి- 1, కరీంనగర్‌-21, ఖమ్మం- 14, కొమురంభీం ఆసిఫాబాద్‌- 2, మహబూబ్‌నగర్‌-4, మహబూబాబాద్‌-8, మంచిర్యాల-7, మెదక్‌- (ఎలాంటి కేసులు లేవు), మేడ్చల్‌ మల్కాజ్‌గిరి-18, ములుగు -2, నాగర్‌ కర్నూల్ – 3, నల్గొండ-16, నారాయణపేట-1, నిర్మల్‌ -4, నిజామాబాద్‌-3, పెద్దపల్లి-16, రాజన్న సిరిసిల్ల-12, రంగారెడ్డి-13, సంగారెడ్డి-5, సిద్దిపేట-6, సూర్యాపేట-8, వికారాబాద్‌- 2, వనపర్తి-3, వరంగల్‌ రూరల్‌ -6, వరంగల్‌ అర్బన్‌-28, యాదాద్రి భువనగిరి-6 చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

ఊరట కలిగిస్తున్న రికవరీ కేసులు..

కాగా, ప్రస్తుతం పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టడమే కాకుండా రికవరీ కేసులు కూడా బాగానే నమోదవుతున్నాయి. రోజురోజకు కోలుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడికి అనేక చర్యలు చేపట్టింది. లాక్‌డౌన్‌, వ్యాక్సినేషన్‌, తదితర ఆంక్షలు చేపట్టడం వల్ల ప్రస్తుతం కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టే దశకు చేరుకుంది.

ఇవి కూడా చదవండి: Drones: అడవుల పెంపకం కోసం నయా ప్లాన్.. డ్రోన్ల సహాయంతో బృహత్తర కార్యక్రమం..

Dumba Goat Farm: ఈ గొర్రెల పెంపకంతో లక్షలు సంపాదిస్తున్నారు.. అతి తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం.. పెంపకం ఎలానో తెలుసుకోండి..