Dumba Goat Farm: ఈ గొర్రెల పెంపకంతో లక్షలు సంపాదిస్తున్నారు.. అతి తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం.. పెంపకం ఎలానో తెలుసుకోండి..

దుంబా అందం, బరువు ఆధారంగా ధర లభిస్తుంది. రెండు నెలల్లో దుంబా పిల్లల ధర రూ .30,000 వరకు ఉంటుంది. కేవలం మూడు, నాలుగు నెలల తరువాత దాని ధర రూ. 70-75 వేల రూపాయలు లభిస్తుంది.

Dumba Goat Farm: ఈ గొర్రెల పెంపకంతో లక్షలు సంపాదిస్తున్నారు.. అతి తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం.. పెంపకం ఎలానో తెలుసుకోండి..
Dumba Goat Farm
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 01, 2021 | 10:05 PM

గొర్రెలు, మేకల పెంపకాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో చేపట్టేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. జీవాల పెంపకాన్ని మరింత లాభసాటిగా మార్చుకుంటున్నారు. ఇందుకోసం పెంపకందారులకు స్థానిక ప్రభుత్వాలు శిక్షణ కూడా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. వ్యవసాయంతో పాటు, రైతుల ఆదాయాన్ని పెంచడానికి పశుపోషణ కూడా ఒక మంచి ఎంపిక అని ఆర్ధిక నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటి వరకు మీరు తప్పనిసరిగా పశుపోషణలో ఆవు, మేక, పందుల పెంపకం గురించి వినే ఉంటారు. కానీ పశువుల పెంపకానికి మరో మంచి ఎంపిక కూడా ఉంది. వాటిలో దుంబా జాతి గొర్రెల పెంపకం.. అవును ఇది కూడా ఉపాధికి మంచి ఎంపిక. డుంబా పెంపకంలోని ప్రత్యేక విషయం ఏమిటంటే అది బాగా లభాలను ఆర్జించి పెడుతుంది. దుంబా మాంసంకు మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. అలాగే ఇది త్వరగా ఎదుగుతుంది.  పశుపోషణ ద్వారా డబ్బు సంపాదించడానికి ఇది గొప్ప ఎంపిక.

ఉత్తర ప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాకు చెందిన గుడ్డు అన్సారీ గత నాలుగు సంవత్సరాలుగా దుంబా జాతి గొర్రెలను పెంచుతున్నాడు. వీటి పెంపకంతో మంచి లాభాలను ఆర్జిస్తున్నాడు. ప్రతి ఏటా లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు.  తక్కువ సమయంలో ఎక్కువ లాభాలను ఆర్జిస్తున్నాడు. మొదట్లో కేవలం ఐదు దుంబాలతో గోట్ ఫామ్‌ను ప్రారంభించినట్లుగా చెప్పాడు. వీటిలో నాలుగు ఆడ గొర్రెలను, ఒక పొటేలును తీసుకొచ్చినట్లుగా తెలిపాడు. అవే అతి కొద్ది రోజుల్లోనే వాటి సంతంతిని అభివృద్ధి చేసినట్లుగా వెల్లడించాడు. అతి కొద్ది రోజుల్లోనే తన గోట్ ఫామ్‌లో 60 దుంబాలతో నిండిపోయిందని అన్నాడు.

దుంబా అంటే ఏమిటి…

తోక గుండ్రంగా, మిల్లు స్టోన్ లాగా బరువైన ఉండే జాతి గొర్రెలనే డుంబా గొర్రెలంటారు. ఈద్-ఉల్-అధా సమయంలో ఈ గొర్రెలకు భారీ డిమాండ్ ఉంటుంది. ఆ సమయంలో వీటి ధర కూడా  అధికంగా ఉంటుంది. ఇవి చాలా బలంగా ఉంటాయి అందుకే వీటి మాంసం అంటే చాలా మంది ఇష్టపడుతారు.

దుంబా ఒకేసారి ఒకే బిడ్డకు జన్మనిస్తుంది. ఖాతాదారుల డిమాండ్ మేరకు గుడ్డు అన్సారీ వారికి దుంబా పిల్లలను విక్రయిస్తాడు. దుంబా 9 వ నెలలో ఏడు నెలల నుండి 1 సంవత్సరం మధ్యలో తొలి బిడ్డను ఇస్తుంది.  దాని అందం, బరువు ఆధారంగా ధర లభిస్తుంది. రెండు నెలల్లో దుంబా పిల్లల ధర రూ .30,000 వరకు ఉంటుంది. మూడు, నాలుగు నెలల తరువాత దాని ధర 70-75 వేల రూపాయలు వరకు ఉంటుంది. దుంబ ధర దాని నాణ్యతపై నిర్ణయిస్తారు.  ఆడ దుంబ ధర బాగానే ఉన్నప్పటికీ.. ఇది పిల్లల ఇస్తుంది కాబట్టి దీనిని అమ్మకానికి పెట్టరు రైతులు. ఒక సంవత్సరం తర్వాత దీని బరువు 100 కిలోల వరకు పెరుగుతుంది.

ఆహారం నిర్వహణ..

దీని ఆహారం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. శీతాకాలంలో బార్లీ , మిల్లెట్ తినిపిస్తారు. ఇది కాకుండా ఆవాల నూనెను తాగిస్తుంటారు. ఎందుకంటే చలి నుంచి మంచి రక్షణ లభిస్తుందని రైతులు అభిప్రాయ పడుతారు.

ఇవి కూడా చదవండి:  Pub Culture: అక్కడ రూల్స్.. గీల్స్ జాన్తానై.. పబ్బుల్లో నిబంధనలు గాలికి.. చిన్నారులను కూడా అనుమతిస్తున్న వైనం..

Afghanistan Crisis: పంజ్‌షేర్‌ వ్యాలీలో తాలిబన్లకు వరుస ఎదురుదెబ్బలు.. తాజాగా 350 మంది హతం.. కీలక ప్రకటన చేసిన నార్తర్న్‌ అలయెన్స్‌..