Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drones: అడవుల పెంపకం కోసం నయా ప్లాన్.. డ్రోన్ల సహాయంతో బృహత్తర కార్యక్రమం..

ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి ఎన్ని చెట్లు నేల కూలుతున్నాయో తెలుసా..? సుమారుగా14 వేల కోట్లుకు పైమాటేనట! మరి వీటి స్థానంలో కొత్తగా ఎన్ని మొక్కలు పుడుతున్నా అంటే.. అది జస్ట్ సగం కూడా లేవట! అందుకే.. అడవులను వేగంగా పెంచాల్సిన అవసరం...

Drones: అడవుల పెంపకం కోసం నయా ప్లాన్.. డ్రోన్ల సహాయంతో బృహత్తర కార్యక్రమం..
Planted Seed Balls By Drone
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 02, 2021 | 3:02 PM

ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి ఎన్ని చెట్లు నేల కూలుతున్నాయో తెలుసా..? సుమారుగా14 వేల కోట్లుకు పైమాటేనట! మరి వీటి స్థానంలో కొత్తగా ఎన్ని మొక్కలు పుడుతున్నా అంటే.. అది జస్ట్ సగం కూడా లేవట! అందుకే.. అడవులను వేగంగా పెంచాల్సిన అవసరం ఇప్పుడు చాలా ఉందని అటవీ శాఖ అధికారులు ముందుకు వచ్చారు. కామారెడ్డి జిల్లా అటవీ శాఖ ఈ సరికొత్త ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా డ్రోన్లతో విత్తనాలను నాటుతున్నారు. భారీగా మొక్కలుగా మొలిచేలా చేయడమే తమ టార్గెట్ అని వాళ్లు చెప్తున్నారు. మామూలుగా మనుషులతో విత్తనాలు నాటాలంటే ఎక్కువ టైంలో తక్కువ పనైతది. ఎక్కువ మంది జనాలు దాని కోసం పనిచేయాల్సి ఉంటుంది.

దాంతో పాటు ఖర్చూ ఎక్కువే. అందుకే వాళ్లు డ్రోన్ టెక్నాలజీపై ఫోకస్ పెట్టారు. ముందుగా వాళ్లకు కావాల్సిన రకరకాల మొక్కల విత్తనాలను సెలెక్ట్​ చేసుకుంటారు. వాటిని మట్టి, ఇతర న్యూట్రియెంట్స్ కలిపిన ఒక ముద్దలో పెడతారు. ఆ ముద్దలను ఉండలుగా చుట్టి సీడ్ బాల్స్​గా మారుస్తారు. ఈ సీడ్ బాల్స్​ను డ్రోన్ ల ద్వారా పై నుంచి జార విడుస్తారు.

దీంతో వానలు పడగానే సీడ్ బాల్స్ మొలకెత్తుతాయి. వాటి చుట్టూ ఉన్న మట్టి, న్యూట్రియెంట్స్ సాయంతో ఏడెనిమిది నెలల వరకూ మొక్కలు బతకగలవు. ఆలోపు వేర్లు పుట్టి, నేలలో బాగా పాతుకుపోతాయి. ఇలా.. డ్రోన్లతో ఈజీగా మొక్కలు పెంచొచ్చని వీరు ప్లాన్ చేశారు.

ఫ్లాష్​ఫారెస్ట్ ప్రాజెక్టును గత కొద్ది రోజులుగా తెలంగాణలో ఎన్జీవోలు నిర్వహిస్తున్నాయి. అయితే ఇప్పుడు అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం పెద్దాయిపల్లి అటవీ ప్రాంతంలో డ్రోన్ ద్వారా విత్తన బాల్స్ వేశారు. గుబ్బ కోల్డ్ స్టోరేజ్ ఆధ్వర్యంలో విత్తనాలను సేకరించినట్లుగా చెప్పారు. అడవిలో పలుచగా ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకుని అక్కడే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు వివరించిన అధికారులు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కామారెడ్డిలోనే ప్రారంభించామని వెల్లడించారు. నేడు లక్ష విత్తనాలను వేయడం జరుగుతుందన్నారు అధికారులు.

తమ ఐడియా సక్సెస్ అవుతుందన్నారు. ఒక మనిషే పది డ్రోన్లను కంట్రోల్ చేయవచ్చని, ఒక్కో డ్రోన్ ఒక సెకనుకు ఒక విత్తనాన్ని జారవిడుస్తుందన్నారు. మామూలుగా మొక్కలు పెంచి, నాటేందుకు అయ్యే ఖర్చుతో పోలిస్తే ఈ పద్ధతిలో అయ్యే ఖర్చు ఐదో వంతు కూడా ఉండదన్నారు. రకరకాల మొక్కలనూ నాటేందుకు వీలవుతుంది కాబట్టి ఫారెస్ట్ ఎకో సిస్టం మెరుగుపడుతుందని చెప్తున్నారు.

ఇవి కూడా చదవండి: Walnuts Benefits: రోజూ అరకప్పు వాల్‌నట్స్‌ తీసుకుంటే గుండె జబ్బులను జయించినట్లే.. ఇది చెబుతోంది ఎవరో కాదండీ..

Viral Video: పామును వేటాడి చంపేసిన ఉడుత.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!