Walnuts Benefits: రోజూ అరకప్పు వాల్‌నట్స్ తీసుకుంటే గుండె జబ్బులను జయించినట్లే.. ఇది చెబుతోంది ఎవరో కాదండీ.
Walnuts Benefits: వాల్‌ట్స్‌ను నిత్యం ఆరోగ్యంలో భాగం చేసుకుంటే చెడు కొలెస్ట్రాల్‌కు అడ్డుకట్ట వేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. దాదాపు 600కిపైగా మందిని పరిగణలోకి తీసుకొని మరీ శాస్త్రవేత్తలు ఈ నిర్ణయానికి వచ్చారు...
Updated on: Sep 02, 2021 | 1:47 PM

వాల్‌నట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనందరికీ తెలిసిందే. ఆరోగ్య నిపుణులు కూడా వాల్‌నట్స్‌ను ఆహారంలో భాగం చేసుకోమని సూచిస్తుంటారు.

తాజాగా ఈ విషయాన్ని మరోసారి రుజువు చేశారు స్పెయిన్‌కు చెందిన డి బార్సిలోనా పరిశోధకులు. సుమారు 628 మందిని పరిగణలోకి తీసుకొని మరీ శాస్ర్తవేత్తలు ఈ నిర్ణయానికి వచ్చారు.

ప్రతిరోజూ అరకప్పు వాల్‌నట్స్‌ను తీసుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్‌కు చెక్‌పెడుతూ గుండె ఆరోగ్యాన్ని బాగు చేస్తుందని పరిశోధనల్లో తేలింది.

వాల్‌నట్స్‌ను నిత్యం ఆహారంలో భాగం చేసుకున్న వారిలో కొలస్ట్రాల్ స్థాయిలు 8.5 శాతం తగ్గినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

అమెరికన్ హార్ట్ అసోషియేషన్ ప్రకారం వాల్‌నట్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. సాధారణంగా ఇది చేపలలో లభిస్తుంది. ఇది కూడా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

వాల్‌నట్స్ హృదయానికే కాకుండా మెదడు ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా గర్భిణీలు వాల్‌నట్స్ తీసుకోవడం వల్ల పుట్టబోయే చిన్నారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.





























