- Telugu News Photo Gallery World coconut day 2021 these are coconut cookies to tender coconut rasmalai instant dessert recipes
World Coconut Day 2021: కొబ్బరితో పసందైన వంటకాలు.. వీటితో క్షణాల్లో చేయ్యొచ్చు..
కొబ్బరిని ఎక్కువగా వంటకాల్లో రుచి పెరగడానికి ఉపయోగిస్తారు. కానీ చాలా వరకు కొబ్బరిని తినడానికి ఇష్టపడరు. కొబ్బరితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. అలాగే ఈ కొబ్బరిని ఉపయోగించి కొన్ని పసందైన వంటలను చెయ్యొచ్చు. అవెంటో తెలుసుకుందామా.
Updated on: Sep 02, 2021 | 1:37 PM

రెగ్యులర్ రాస్మలైతో విసుగు చెందినవారు సరికొత్తగా కొబ్బరితో ట్రై చేయవచ్చు. మలై, కొబ్బరి మలై, పాలు కలిపి వీటిని చెయ్యోచ్చు. అలాగే వీటికి యాలకులను జోడించవచ్చు.

కొబ్బరి తురుము, పాలు, యాలకులు, పాలపొడి కలిపి కొబ్బరి బంతులను తయారు చేయవచ్చు. వీటిని గాలి చొరబడని కంటైనర్‌లో రిఫ్రిజిరేటర్లో భద్రపరిస్తే ఎక్కువ రోజులు ఉంటాయి.

వెన్న, చక్కెర, క్రీము కొబ్బరి కలిపి కొబ్బరి కుకీలను రెడీ చేయవచ్చు. వీటిని మరింత రుచిగా చేయాలంటే.. ఫుడ్ కలరిగ్ ఉపయోగించవచ్చు.

ఓట్ మీల్, కొబ్బరి పాలు, మామిడి పండ్లు, పెరుగు, పొద్దు తిరుగుడు విత్తనాలను అన్ని కలిపి మిక్సీ పట్టాలి. ఆ మిశ్రమంలో ఓట్స్ కలిపి దానిని పాన్‌లో వేడి చేసి మామిడి కొబ్బరి స్పూతీ చేసుకోవచ్చు.

గుడ్డు సొనలతో విప్ చక్కెర లేదా చాక్లెట్ కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. ఆ తర్వాత దానికి ఐస్ క్రీమ్ కలపాలి. గ్లాసు పాత్రలో ఉంచి.. ఆ తర్వాత ఫ్రీజ్‌లో పెట్టాలి.





























