AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona: దేశంలో తగ్గుతున్న కరోనా రికవరీల సంఖ్య.. నిన్న ఎన్ని కేసులు, మరణాలు నమోదయ్యాయంటే..?

Coronavirus updates in India: భారత్‌లో కరోనావైరస్ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా ఇటీవల తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. దేశంలో అత్యధికంగా..

Corona: దేశంలో తగ్గుతున్న కరోనా రికవరీల సంఖ్య.. నిన్న ఎన్ని కేసులు, మరణాలు నమోదయ్యాయంటే..?
Covid-19 India news
Shaik Madar Saheb
|

Updated on: Mar 06, 2021 | 10:53 AM

Share

Coronavirus updates in India: భారత్‌లో కరోనావైరస్ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా ఇటీవల తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో ఆ తరువాత కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరిగాయి. గత 24గంటల్లో దేశవ్యాప్తంగా 18,327 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ మేరకు శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,92,088 (1.11కోట్లు) కు చేరింది.

ఈ మహమ్మారి కారణంగా గత 24గంటల్లో దేశవ్యాప్తంగా 108 మంది మరణించారు. వీరితో కలిపి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,57,656 కు చేరింది. కరోనా కేసులతో పోల్చుకుంటే.. నిన్న డిశ్చార్జ్‌ల సంఖ్య గణనీయంగా తగ్గింది. కరోనా నుంచి నిన్న 14,234 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు 1,08,54,128 మంది బాధితులు కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 1,80,304 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 96.98 శాతానికి చేరగా.. మరణాల రేటు 1.41 శాతంగా ఉంది. నిన్న దేశవ్యాప్తంగా 7,51,935 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. వీటితో కలిపి మార్చి 5వ తేదీ వరకు మొత్తం 22,06,92,677 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్స్ వెల్లడించింది. ఇదిలాఉంటే.. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా 1,94,97,704 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Also Read:

Follow Us
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!