AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా వైరస్ వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై ప్రధాని మోదీ ఫోటోలను తొలగించండి, కేంద్రానికి ఈసీ ఆదేశం

కరోనా వైరస్ వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై ప్రధాని మోదీ ఫోటోలను తొలగించాలని కేంద్రాన్ని  ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ముఖ్యంగా ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలలో...

కరోనా వైరస్ వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై ప్రధాని మోదీ ఫోటోలను తొలగించండి, కేంద్రానికి ఈసీ ఆదేశం
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Mar 06, 2021 | 11:42 AM

Share

కరోనా వైరస్ వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై ప్రధాని మోదీ ఫోటోలను తొలగించాలని కేంద్రాన్ని  ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ముఖ్యంగా ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలలో తక్షణమే ఈ చర్య తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. మిగతా రాష్ట్రాల కు ఈ నిబంధన వర్తించబోదు.  ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈ సర్టిఫికెట్లపై ఇక ప్రధాని ఫోటోలు ఉండరాదంటూ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ కి చెందిన నేతలు ఈసీకి ఫిర్యాదు చేస్తూ..ఈ చర్య మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ని ఉల్లంఘించడమేనని ఆరోపించింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ  జారీ చేసిన ఈ సర్టిఫికెట్లపై మోదీ ఫోటోలు ఉంచడం ఓటర్లను ప్రభావితం చేసే చర్య అని, పైగా  డాక్టర్లు, నర్సులు, ఇతర హెల్త్ కేర్ సిబ్బంది నుంచి క్రెడిట్ సంపాందించేందుకు ఇది ఓ నిర్ణయమని వారన్నారు. అలాగే కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తిదారుల నుంచి కూడా తన గొప్పదనాన్నిచాటుకునేందుకు మోదీ ఈ చర్య తీసుకున్నారని టీఎంసీ నేత డెరెక్ ఓబ్రీన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా పన్ను చెల్లింపుదారుల పేరిట అనుచితపబ్లిసిటీని సంపాదించేందుకు ఉద్దేశించిన ఈ పద్దతికి వెంటనే స్వస్తి చెప్పాలని ఆయన అన్నారు.

దీంతో ఎలెక్షన్ కమిషన్.. బెంగాల్ ఎలెక్టోరల్ ఆఫీసర్ నుంచి, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి వివరణ కోరుతూ వ్యాక్సిన్ సెర్టిఫికెట్ల నుంచి మోదీ ఫోటోలను తొలగించాలని ఆదేశించింది. ఇప్పటికే ఈ రాష్ట్రాల్లో ఈ సర్టిఫికెట్లపై మోదీ ఫోటో ఉన్నవి లక్షలాదిగా జారీ అయ్యాయి. 60 ఏళ్ళు, 45 ఏళ్ళు, ఆపై బడినవారిలో శారీరక రుగ్మతలు, ఇతర జబ్బులు కలిగినవారికి వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమం దేశవ్యాప్తంగా ఇటీవల ప్రారంభమైంది. ఇప్పటివరకు కొన్ని వేలమందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇంకా ఈ కార్యక్రమం యుధ్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు.

మరిన్నీ చదవండి ఇక్కడ :

స్పర్మ్ డొనేట్ చేస్తే లక్షల్లో డబ్బులు..డబ్బులు లేక చేసిన పని లక్షల్లో ఆదాయం చూపింది : Sperm Donor Video.

విజయనగరం యువతి ఫేక్‌స్టోరీ! కాళ్లుచేతులు కట్టేసుకుని..తానే నాటకం ఆడినట్టు అంగీకారం : girl kidnap video