సాహసోపేత నిర్ణయం తీసుకున్న బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ

తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉత్తినే సివంగి అనలేదు.. నిజంగానే ఆమె సివంగి. ప్రత్యర్థులకు బెంబేలెత్తించే ఆడపులి..

సాహసోపేత నిర్ణయం తీసుకున్న బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ
Follow us
Balu

|

Updated on: Mar 06, 2021 | 10:20 AM

తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉత్తినే సివంగి అనలేదు.. నిజంగానే ఆమె సివంగి. ప్రత్యర్థులకు బెంబేలెత్తించే ఆడపులి.. రాజకీయ నేతలు మాట మీద నిలబడరు.. అలా నిలబడితే వారు వారు రాజకీయనేతలెలా అవుతారు.. కానీ మమతా రాజకీయాలు చేయడానికి పాలిటిక్స్‌లో రాలేదు.. ప్రజాసంక్షేమం ప్రథమ ధ్యేయంగా ఆమె రాజకీయాల్లోకి వచ్చారు.. అందుకే ఆమె మాట మీద నిలబడతారు.. సవాల్‌ చేస్తే అందుకు కట్టుబడతారు. మన నేతలు చాలాసార్లు చాలా రకాలుగా సవాళ్లు ప్రతిసవాళ్లు విసురుకున్నారు. అయితే నిలబడినవారిని మాత్రం వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు.. మమతా బెనర్జీది విభిన్నమైన శైలి.. ఇప్పటి వరకూ దేశంలో మరెవ్వరూ చేయని సాహసాన్ని ఆమె చేశారు. ఓ గట్టి సవాల్‌ను ఎదుర్కొన్నారు. చెప్పినట్టుగానే నందిగ్రామ్‌ నుంచి పోటీ చేయడానికి ఎంత దమ్ము ఉండాలి? ఎంత ధైర్యం ఉండాలి? కేవలం మిడ్నాపూర్‌ జిల్లాలోని నందిగ్రామ్‌ నుంచే పోటీ చేస్తానని, భవానిపూర్‌ నుంచి శోభన్‌దేవ్‌ చటోపాధ్యాయ పోటీ చేస్తారని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. మమతా బెనర్జీకి భవానీపూర్‌ పెట్టని కోట! ఇప్పటి వరకు ఆమెది ఆ నియోజకవర్గమే! మరి నందిగ్రామ్‌కు ఎందుకు తరలివెళుతున్నారు? గెలుపుపై సందేహమా? అంటే కాదు.. ప్రత్యర్థి విసిరిన సవాల్‌ను స్వీకరించడమే! ఈ మధ్యనే నందిగ్రామ్‌కు చెందిన సుబేందు అధికారి తృణమూల్‌ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. నందిగ్రామ్‌లో సుబేందుకు చాలా పట్టుంది.. ఆ నియోజకవర్గంలో బలగమూ ఉంది.. సుబేందు చేసిన పని మమతాకు కోపం తెప్పించింది.. తృణమూల్‌ను కాదని వెళ్లిపోయిన సుబేందుకు తగిన పాఠం నేర్పిస్తానని, తాను నందిగ్రామ్‌ నుంచే పోటీ చేసి సుబేందును ఓడిస్తానని మమతా శపథం చేశారు. మమతా మాటవరసకు చెప్పారే కానీ పాటిస్తారా ఏమిటీ అని చాలా మంది అనుకున్నారు.. కానీ మమతా వేరు కదా! ఇచ్చిన మాటకు కట్టుబడి నందిగ్రామ్‌ నుంచే బరిలో దిగాలని నిర్ణయించుకున్నారు.. పైగా భవానీపూర్‌ను వదిలేయడం మరో సాహసం. రాజకీయాలలో మమతా బెనర్జీలాంటి వారు చాలా అరుదుగా కనిపిస్తారు. వర్తమానంలో అలాంటి వారు ఎవరూ లేరు.. ఆమెది విలక్షణ శైలి. రబ్బరు చెప్పులే వేసుకునేంతటి సాధారణమైన జీవితం ఆమెది. కాంగ్రెస్‌తో పడక అందులోంచి బయటకు వచ్చి తృణమూల్‌ కాంగ్రెస్‌ పేరిట కొత్త పార్టీ పెట్టుకున్నారు. బెంగాల్‌లో పాతుకుపోయిన వామపక్ష పార్టీలను మట్టికరిపించారు. కమ్యూనిస్టుల నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. వరుసగా రెండు సార్లు ఘన విజయం అందుకున్నారు.. ఇప్పుడు మూడోసారి విజయం సాధించాలన్న పట్టుదలతో ఉన్నారామె! ఈ ఎన్నికల్లో మమత విజయం సాధిస్తారా? హ్యాట్రిక్‌ కొడతారా? బీజేపీ కోరిక నెరవేరుతుందా? అన్న ప్రశ్నలను పక్కన పెడితే నందిగ్రామ్‌ నుంచి పోటీ చేస్తూ మమతా కొత్త ఒరవడికి తెరతీశారు. ఇప్పుడు అందరి దృష్టి ఆ నియోజకవర్గంపైనే ఉంది..

మరిన్ని చదవండి ఇక్కడ :

స్పర్మ్ డొనేట్ చేస్తే లక్షల్లో డబ్బులు..డబ్బులు లేక చేసిన పని లక్షల్లో ఆదాయం చూపింది : Sperm Donor Video.

విజయనగరం యువతి ఫేక్‌స్టోరీ! కాళ్లుచేతులు కట్టేసుకుని..తానే నాటకం ఆడినట్టు అంగీకారం : girl kidnap video