AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RTO Office: వాహనదారులు ఇకపై ఆర్టీవో ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు… 18 సేవలు ఆన్‌లైన్‌లోనే..

RTO Office: ప్రస్తుతం అన్ని రంగాల్లో ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా డిజిటల్‌ సేవలకు ప్రాధాన్యత కల్పిస్తున్నాయి. ప్రజలకు అందించే సేవల్లో సాంకేతికతను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా..

RTO Office: వాహనదారులు ఇకపై ఆర్టీవో ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు... 18 సేవలు ఆన్‌లైన్‌లోనే..
Narender Vaitla
|

Updated on: Mar 06, 2021 | 9:33 AM

Share

RTO Office: ప్రస్తుతం అన్ని రంగాల్లో ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా డిజిటల్‌ సేవలకు ప్రాధాన్యత కల్పిస్తున్నాయి. ప్రజలకు అందించే సేవల్లో సాంకేతికతను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రవాణా శాఖ కూడా తమ సేవలను ఆన్‌లైన్‌లోనే అందిస్తోంది. లెర్నర్స్‌ లైసెన్స్‌, వాహన యాజమాన్య హక్కుల మార్పు, డూప్లికేట్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ రెన్యువల్‌తో పాటు 18 రకాల సేవలను పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌లో అందించనుంది. ఈ విషయమై తాజాగా కేంద్ర రవాణా శాఖ సర్క్యులర్‌ జారీ చేసింది. ఈ ఆన్‌లైన్‌ సేవలు మార్చి 3 నుంచి అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఇకపై వాహనదారులు ఆర్టీవో కార్యాలయాలకు వెళ్లకుండానే సేవలను పొందొచ్చన్నమాట. అయితే ఈ సేవలను ఆన్‌లైన్‌లో పొందాలంటే కచ్చితంగా ఆధార్‌ అథెంటికేషన్‌ చేసుకోవాల్సి ఉంటుందని రవాణా శాఖ పేర్కొంది.

ఆన్‌లైన్‌లో లభించనున్న సేవలు ఇవే..

* లెర్నర్స్‌ లైసెన్స్‌ * డ్రైవింగ్‌ లైసెన్స్‌ రెన్యూవల్‌ * డూప్లికేట్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌, రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ * డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహన రిజిస్ట్రేషన్‌ పత్రంలో చిరునామా మార్పు * అంతర్జాతీయ డ్రైవింగ్‌ లైసెన్స్‌ * వాహన యాజమాన్య హక్కుల బదిలీకి ఎన్‌వోసీ, బదిలీ దరఖాస్తు. * ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ పర్మిట్‌. * లైసెన్స్‌ నుంచి వాహనాలను తొలగించడం. * తాత్కలిక రిజిస్ట్రేషన్‌ అప్లికేషన్‌. * రిజిస్ట్రేషన్‌ డూప్లికేట్‌ సర్టిఫికేట్‌. * NOC సర్టిఫికేట్‌. * వాహన యజమాని పేరు మార్పిడి. * రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేట్‌లో చిరునామా మార్పిడి. * హైర్‌-పర్చెస్‌ అగ్రిమెంట్‌. * హైర్‌-పర్చెస్‌ అగ్రిమెంట్‌ తొలగింపు. వీటితో పాటు మరికొన్ని సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురావడానికి రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది.

Also Read: Bride Died In Marriage: అత్తారింటికి బయలుదేరిన కొత్త పెళ్లికూతురు.. అంతలోనే అనంతలోకాలకు.. అసలేం జరిగిందంటే..

CERAWeek event: వాతావరణ మార్పులతో అలాగైతేనే పోరాడగలం.. ‘సెరా వీక్’ సదస్సులో ప్రధాని మోదీ

Tamil Nadu Assembly Election 2021: బీజేపీ – ఏఐఏడీఎంకే మధ్య కుదిరిన ఏకాభిప్రాయం.. బీజేపీ ఎన్ని సీట్లల్లో పోటీ చేయనుందంటే..?

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత