CERAWeek event: వాతావరణ మార్పులతో అలాగైతేనే పోరాడగలం.. ‘సెరా వీక్’ సదస్సులో ప్రధాని మోదీ
PM Narendra Modi: ప్రపంచంలో వాతావరణ మార్పులు, విపత్తులు ప్రస్తుతం పెను సవాళ్లుగా పరిణమించాయని.. ఈ రెండింటికి అనుసంధానం ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. వీటిని అధిగమించేందుకు..
PM Narendra Modi: ప్రపంచంలో వాతావరణ మార్పులు, విపత్తులు ప్రస్తుతం పెను సవాళ్లుగా పరిణమించాయని.. ఈ రెండింటికి అనుసంధానం ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. వీటిని అధిగమించేందుకు ముఖ్యంగా మన ప్రవర్తనలో మార్పు రావాలంటూ ఆయన పేర్కొన్నారు. దీంతోపాటు పారిస్ ఒప్పందంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను అనుసరించాలని మోదీ సూచించారు. కేంబ్రిడ్జ్ ఎనర్జీ రీసెర్చ్ అసోసియేట్స్ (CERAWeek).. ప్రతిష్ఠాత్మక సెరావీక్ ప్రపంచ ఇంధన, పర్యావరణ నాయకత్వ పురస్కారాన్ని శుక్రవారం ప్రధాని మోదీకి ప్రదానం చేసింది.
పర్యావరణ, ఇంధన సుస్థిరత పట్ల అంకితభావంతో పనిచేస్తున్నందుకుగాను మోదీని ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ మేరకు అమెరికా కేంద్రంగా శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సెరావీక్-2021 వార్షిక సదస్సు లో ప్రధాని మోదీ ప్రసంగించారు. తనకు లభించిన పురస్కారాన్ని.. సంప్రదాయం రూపంలో పర్యావరణ పరిరక్షణకు మార్గం చూపిన మాతృభూమికి, దేశ ప్రజలకు అంకితమిస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. దేశంలో ప్రకృతి, సంస్కృతి, దైవం సమ్మిళితంగా ఉంటాయని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తులు ఒకదానికొకటి అనుసంధానమైనవేనని ప్రధాని పేర్కొన్నారు. అయితే వాటిని ఎదుర్కొనేందుకు రెండు మార్గాలున్నాయని.. నిబంధనలు, మార్గదర్శకాలతో సవాళ్లను ఎదుర్కోవడం.. ప్రజల ప్రవర్తనలో మార్పు తీసుకురావడమని మోదీ పేర్కొన్నారు. పారిస్ వాతావరణ ఒప్పందంలోని లక్ష్యాలను 2030 నాటికల్లా చేరుకోవాలని అనుకున్నామని.. కానీ భారత్ వీటిని ముందే అధిగమిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తంచేశారు.
Also Read: