రక్తంతో తడిచిన నేల మీదకు శాంతి సందేశం.. ఇరాక్‌లో పోప్ ఫ్రాన్సిస్ సుడిగాలి పర్యటన

ఓ వైపు కోవిడ్ భయం, మరో వైపు తీవ్రవాద దాడులు.. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇరాక్‌లో పర్యటిస్తున్నారు పోప్‌ ఫ్రాన్సిస్.

  • Balaraju Goud
  • Publish Date - 9:26 pm, Fri, 5 March 21
రక్తంతో తడిచిన నేల మీదకు శాంతి సందేశం.. ఇరాక్‌లో పోప్ ఫ్రాన్సిస్ సుడిగాలి పర్యటన

Pope Francis Iraq tour : ఓ వైపు కోవిడ్ భయం, మరో వైపు తీవ్రవాద దాడులు.. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇరాక్‌లో పర్యటిస్తున్నారు పోప్‌ ఫ్రాన్సిస్. ఇరాక్‌లో పోప్ పర్యటించడం ఇదే తొలిసారి. 2012లో ఎన్నికైనప్పటి నుండి పోప్ ఫ్రాన్సిస్ తన అత్యంత ప్రమాదకర విదేశీ పర్యటన బాగ్దాద్‌లో అడుగుపెట్టాడు. పోప్ పర్యటనకు పదివేల మందితో భద్రత కల్పిస్తోంది ఇరాక్ ప్రభుత్వం.

యుద్ధం సృష్టించిన గాయాలు, తీవ్రవాద దాడులతో రక్తంతో తడిచిన నేల మీదకు శాంతి సందేశం తీసుకొచ్చానని చెప్పాడు పోప్ ఫ్రాన్సిస్. ఇరాక్‌కు పోప్ రావడం ఇదే తొలిసారి. కరోనా బయటపడిన తర్వాత పోప్ తొలి విదేశీ పర్యటన కూడా ఇదే. ప్రత్యేక అలిటాలియా విమానంలో అతనితోపాటు పరివారం, భద్రతా సిబ్బంది సుమారు 75 మంది జర్నలిస్టులు.. స్థానిక సమయం మధ్యాహ్నం 2 గంటలకు బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో షెడ్యూల్ కంటే కొంచెం ముందే చేరుకున్నారు.ఈ పర్యటనలో బాగంగా.. క్రైస్తవుల ప్రతినిధిగా మత సామరస్యం కోసం ఇరాక్‌లో ప్రముఖ షియా ముస్లిం ప్రవక్తలను కలవనున్నారు.

ఇర్బిల్ పట్టణంలో ప్రార్థనలు నిర్వహిస్తారు. పోప్‌ పర్యటనలో ఆయనకు భద్రత కల్పించేందుకు 10వేల మందిని మోహరించింది ఇరాక్ ప్రభుత్వం. కోవిడ్ వైరస్ ప్రమాదంతో పాటు టెర్రరిస్ట్ అటాక్స్‌ను దృష్టిలో పెట్టుకుని పోప్ పర్యటించే ప్రాంతాల్లో కర్ఫ్యూ విధిస్తోంది.

1999లో పోప్ జాన్ పాల్ టూ ఇరాక్ వస్తానని ప్రకటించారు. అయితే అప్పట్లో ఉన్న సద్దాం హుస్సేన్ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదు. ఈసారి కూడా అలాంటి పరిస్థితి ఉంటుందేమోనని ఇరాక్‌ క్రిస్టియన్లు భావించారు. అయితే మరోసారి నిరాశ ఎదురుకానివ్వనని ప్రకటించిన పోప్ ప్రాన్సిస్‌… బాగ్దాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అడుగు పెట్టారు.

ఇరాక్‌లో రెండు దశాబ్ధాల క్రితం 14 లక్షల మంది క్రిస్టియన్ల నుంచి రెండున్నర లక్షలకు పడిపోయింది. 2003లో ఇరాక్ మీద అమెరికా దాడి తర్వాత ఇరాక్‌లో అరాచక శక్తులు, టెర్రరిస్టు ముఠాలు రెచ్చిపోయాయి. క్రైస్తవుల్ని టార్గెట్ చేసుకుని దాడులు జరిగాయి. దీంతో లక్షల మంది ఇరాక్ వదిలి వెళ్లారు. 2014లో ఇస్లామిక్ స్టేట్ విస్తరణ తర్వాత… క్రైస్తవుల మీద దాడులు, చర్చ్‌ల విధ్వంసం మరింత పెరిగింది. పోప్‌ పర్యటనతో పరిస్థితులు కొంతైనా మారతాయని స్థానిక క్రిస్టియన్లు ఆశతో ఉన్నారు.

యుద్ధంతో తల్లడిల్లిన భూమికి తాను శాంతి యాత్రికుడిగా వస్తున్నానని పోప్ ప్రాన్సిస్ వీడియో సందేశంలో తెలిపారు. ఇరాక్‌లో పోప్‌కు రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు ప్రధాని ముస్తఫా అల్‌ ఖదిమీ. పోప్ టూర్ తర్వాతైనా ఇరాక్‌లో క్రైస్తవుల పట్ల వివక్ష నశిస్తుందనే ఆశతో ఉంది క్రిస్టియన్ సమాజం.

పోప్ ఫ్రాన్సిస్ సుడిగాలి పర్యటనలో భాగంగా ప్రత్యేక విమానం, హెలికాప్టర్ , సాయుధ కారు ద్వారా నాలుగు నగరాల్లో చుట్టేయనున్నారు. అతను బాగ్దాద్ చర్చిలో సామూహికంగా నిర్వహించే ప్రార్థనల్లోనూ పాల్గొంటారు. దక్షిణ నగరమైన నజాఫ్‌లోని ఇరాక్‌లోని అగ్రశ్రేణి షియా ముస్లిం మతాధికారిని కలుసుకుని, ఉత్తరాన మోసుల్‌కు వెళతారు. అక్కడ ఇరాక్ ప్రధానమంత్రి పర్యటన కోసం భద్రతా కారణాల దృష్ట్యా సైన్యం వీధుల్లో ప్రత్యేక భద్రత చర్యలు చేపట్టింది.

ఇదీ చదవండిః సంవత్సరానికి కేవలం 5 గంటలు మాత్రమే తెరచి ఉండే ఆలయం.. అమ్మవారికి ఆలయంలోకి మహిళలకు ప్రవేశం లేదు.. ఎక్కడుదంటే..