Today Gold Price: భారీగా పతనమవుతున్న బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?
Today Gold Price: దేశంలో బాంగారం, వెండి కొనుగోలు ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. అయితే ప్రతిరోజూ పెరుగుతున్న పసిడి ధరలు..
Today Gold Price: దేశంలో బాంగారం, వెండి కొనుగోలు ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. అయితే ప్రతిరోజూ పెరుగుతున్న పసిడి ధరలు తాజాగా తగ్గుముఖం పట్టాయి. శనివారం దేశీయంగా బంగారం ధర ఇలా ఉన్నాయి. దేశీయంగా 10 గ్రాముల బంగారంపై రూ.470 తగ్గుముఖం పట్టింది. అంటే ఒక గ్రాము బంగారంపై రూ.47 తగ్గింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 43,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,560 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.41,840 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,630 వద్ద ఉంది. అలాగే బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.41,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,220, కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,820 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,220 ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో… అలాగే హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.41,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,220 ఉంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.41,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,800 వద్ద కొనసాగుతోంది.
అయితే బంగారం కొనుగోలు చేసే వారికి ఇది సరైన సమయమని బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇంకా తగ్గుతుందా… లేక ఇంతేనా అనే ప్రశ్నకు సమాధానం లేదని పేర్కొంటున్నారు. ఇంకా తగ్గవచ్చనే అంచనా ఉంది కానీ ఎంత వరకూ తగ్గుతుందో చెప్పలేమని సూచిస్తున్నారు. అయితే.. వచ్చే 2 నెలల తర్వాత నుంచి బంగారం ధరలు పెరుగుతాయనే అంచనాతో ఉన్నారు. మళ్లీ 22 క్యారెట్ల నగల బంగారం 10 గ్రాములు రూ.50,000 చేరే అవకాశం కూడా ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. గతేడాది ఆగస్టు 7న నగల బంగారం ధర 10 గ్రాములు అత్యధికంగా రూ.54,200 ఉంది. మరి ఇప్పుడు రూ.42 వేలకుపైగా ఉంది. అంటే.. ఈ 7 నెలల్లో బంగారం ధర రూ.12వేలకుపైగా తగ్గింది. అదే 24 క్యారెట్ల బంగారమైతే 7 నెలల్లో రూ.13వేలకు పైగా తగ్గడం గమనార్హం.
Also Read: