AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid Vaccination: జంతువులకు కూడా కరోనా వ్యాక్సినేషన్‌.. ప్రపంచంలోనే తొలిసారి..

Covid Vaccination For Animals: ప్రపంచాన్ని భయపెట్టిన కరోనా మహమ్మారి భయపెడుతూ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది. భారత్‌లో...

Covid Vaccination: జంతువులకు కూడా కరోనా వ్యాక్సినేషన్‌.. ప్రపంచంలోనే తొలిసారి..
Narender Vaitla
|

Updated on: Mar 06, 2021 | 10:38 AM

Share

Covid Vaccination For Animals: ప్రపంచాన్ని భయపెట్టిన కరోనా మహమ్మారి భయపెడుతూ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది. భారత్‌లో ఇప్పటికే తొలి విడదల వ్యాక్సినేషన్‌ పూర్తికాగా.. రెండో విడత శరవేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే భారత్‌కు చెందిన వ్యాక్సిన్లు ప్రపంచ దేశాలకు సైతం ఎగుమతులు అవుతున్నాయి. ఇదిలా ఉంటే కరోనా వైరస్‌ కేవలం మనుషులకే కాకుండా జంతువులకు కూడా సోకిన ఘటనలను మనం చూశాం. కొన్ని దేశాల్లోని జూలలో జంతువుల్లో కోవిడ్‌-19 వైరస్‌ను పరిశోధకులు గుర్తించారు. మనుషులకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది.. మరి జంతువులు పరిస్థితి ఏంటి.? అని ఎప్పుడైనా ఆలోచించారా.

తాజాగా ఈ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ప్రపంచంలో తొలిసారి గ్రేట్‌ ఏప్స్‌ (కోతి జాతుల్లో ఒకటి)కి వ్యాక్సిన్‌ ఇచ్చారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ఓ జంతు ప్రదర్శన శాలలో ఉన్న ఏప్స్‌కి వ్యాక్సినేషన్‌ చేశారు. జంతువుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ వ్యాక్సిన్‌ను ఒకేసారి రెండు డోసులు ఇస్తారు. సాధారణంగా మనుషులకు ఒకసారి ఒకే డోస్‌ ఇస్తారనే విషయం తెలిసిందే. ఇక జంతువుల కోసం ఈ వ్యాక్సిన్‌ను వెటెరినరీ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ రూపొందించింది. ఈ వ్యాక్సిన్‌ టెస్ట్‌లో భాగంగా ఏప్స్‌కు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చేపట్టారు. ఈ జూలో ఉన్న 9 ఏప్స్‌కు వ్యాక్సినేషన్‌ చేపట్టారు. ఇక జూ సిబ్బంది వల్ల ఈ జంతువులకు కరోనా వ్యాపించింది. ఇదిలా ఉంటే ఏప్స్‌తో పాటు జూలో ఉన్న గొరిల్లాలకు కూడా కరోనా సోకింది. కానీ వాటిలో యాంటీ బాడీలు ఉత్పత్తి కావడంతో వాటికి వ్యాక్సిన్‌ ఇవ్వలేదు. మరి ఈ వ్యాక్సిన్‌ జంతువులపై సరిగ్గా పనిచేస్తుందా.? ఏమైనా సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయా.. అన్న విషయాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.

Also Read: Coronavirus vaccination: దేశంలో రికార్డు స్థాయిలో కరోనా వ్యాక్సినేషన్.. గత 24గంటల్లో ఎన్ని లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చారంటే..?

Covid19 Vaccine Storage Freezer : కరోనా వైరస్ వ్యాక్సిన్ ను నిల్వ చేసుకునే సరికొత్త ఫ్రీజర్ లాంఛ్.. దీని స్పెషాలిటీస్ ఏమిటంటే

స్పర్మ్ డొనేట్ చేస్తే లక్షల్లో డబ్బులు..డబ్బులు లేక చేసిన పని లక్షల్లో ఆదాయం చూపింది : Sperm Donor Video.

భారతదేశంలో అత్యంత ధనవంతులు ఎవరు? ఎవరి సంపద ఎక్కువగా పెరిగింది?
భారతదేశంలో అత్యంత ధనవంతులు ఎవరు? ఎవరి సంపద ఎక్కువగా పెరిగింది?
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో