Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid19 Vaccine Storage Freezer : కరోనా వైరస్ వ్యాక్సిన్ ను నిల్వ చేసుకునే సరికొత్త ఫ్రీజర్ లాంఛ్.. దీని స్పెషాలిటీస్ ఏమిటంటే

కోవిడ్ వ్యాక్సిన్ ను నిల్వ చేసుకునే ప్రీజర్ ను గురువారం హైదరాబాద్ లో ప్రారంభించారు. గాలి మరియు సౌర శక్తి రెండింటి యొక్క హైబ్రిడ్ పునరుత్పాదక ఇంధన వనరుపై పనిచేస్తుంది. దీనికి చిల్లర్ మిల్ అనే పేరుతో...

Covid19 Vaccine Storage Freezer : కరోనా వైరస్ వ్యాక్సిన్ ను నిల్వ చేసుకునే సరికొత్త ఫ్రీజర్ లాంఛ్.. దీని స్పెషాలిటీస్ ఏమిటంటే
Follow us
Surya Kala

|

Updated on: Mar 05, 2021 | 4:53 PM

Covid19 Vaccine Storage Freezer : కోవిడ్ వ్యాక్సిన్ ను నిల్వ చేసుకునే ప్రీజర్ ను గురువారం హైదరాబాద్ లో ప్రారంభించారు. గాలి మరియు సౌర శక్తి రెండింటి యొక్క హైబ్రిడ్ పునరుత్పాదక ఇంధన వనరుపై పనిచేస్తుంది. దీనికి చిల్లర్ మిల్ అనే పేరుతో రిలీజ్ చేస్తున్నామని కోల్డ్ చైన్ వస్తువులను తయారు చేసే సంస్థ రాక్‌వెల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తెలిపింది. ఈ కొత్త ఫ్రీజర్ COVID-19 వ్యాక్సిన్‌ను అవసరమైన ఉష్ణోగ్రతలలో నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు.

ఈ సందర్భంగా రాక్వెల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ ప్రతీక్ గుప్తా మాట్లాడుతూ, ” వ్యాక్సిన్ స్టోరేజ్ కోసం తయారు చేసిన ఈ ఫ్రీజర్ ను ‘చిల్లర్‌మిల్’ అని పిలవబడుతుంది.. ఈ ఫ్రీజర్ హైబ్రిడ్ పునరుత్పాదక శక్తిపై నడుస్తున్న మొట్టమొదటిది అని చెప్పారు. ఇది సౌర శక్తిని ఇంధన వనరుగా తీసుకుని పనిచేస్తుందని తెలిపారు. ఈ చిల్లర్ ఫ్రీజర్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తెలిపిందని చెప్పారు. కొన్ని టీకాలను 2 ° C నుండి 8 ° C మధ్య ఉష్ణోగ్రతల మధ్య.. మరికొన్నింటిని -20. C ఉష్ణోగ్రతల మధ్య ఉంచాలి. ఇప్పటి వరకూ డెయిరీఉత్పత్తులు, ఐస్ క్రీములు నిల్వచేసుకునే ఫ్రిడ్జ్ లను మాత్రమే రాక్వెల్ సంస్థ ఉత్పత్తి చేసింది. అయితే ఇప్పుడు ఔషదాల విభాగంలో ప్రవేశించాలని నిర్ణయించుకున్నామని రాక్వెల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ గుప్తా తెలిపారు.

ఇతర ఫ్రీజర్‌లకు ‘చిల్లర్‌మిల్’ మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే, రెండోది హైబ్రిడ్ పునరుత్పాదక శక్తిపై నడుస్తుంది, అంటే ఇది గాలి మరియు సౌర శక్తి రెండింటిలోనూ నడుస్తుంది. దీని ఖరీదు రూ. 40,000 నుండి లక్ష రూపాయల వరకు ఉంటుంది అని అశోక్ గుప్తా చెప్పారు.

Also Read:

ప్రాణం మీదకు తెచ్చిన తొందరపాటు.. నాలుగో అంతస్తు నుంచి కిందపడిన విద్యార్థులు

బిగ్‏బాస్ విన్నర్ అభిజీత్‏కు లక్కీ ఛాన్స్.. ఒకేసారి మూడు సినిమాల్లో ఛాన్స్ ఇచ్చేసిన స్టార్ హీరో..