International Women’s Day 2021 : ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం.. అయితే భూమి మీద 2030 నాటికి మహిళల సంఖ్య భూమిపై సగం సగం

అమ్మగా లాలిస్తుంది. అక్కా, చెల్లిగా అనుబంధాన్ని పంచుతుంది. భార్యగా బాధ్యతలు నిర్వర్తిస్తుంది. పాత్ర ఏదైనా పరిపూర్ణ బాధ్యత నిర్వర్తించే అపూర్వ వ్యక్తి మహిళ. మగువలను గౌరవించాలనే...

International Women's Day 2021 : ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం.. అయితే భూమి మీద 2030 నాటికి మహిళల సంఖ్య  భూమిపై సగం సగం
Follow us

|

Updated on: Mar 06, 2021 | 5:44 PM

International Women’s Day 2021 : అమ్మగా లాలిస్తుంది. అక్కా, చెల్లిగా అనుబంధాన్ని పంచుతుంది. భార్యగా బాధ్యతలు నిర్వర్తిస్తుంది. పాత్ర ఏదైనా పరిపూర్ణ బాధ్యత నిర్వర్తించే అపూర్వ వ్యక్తి మహిళ. మగువలను గౌరవించాలనే భావన భారతీయుల రక్తంలోనే ఉంది. యత్ర నార్యంతు పూజ్యతే, రమంతే తత్ర దేవత..’ అంటే ఎక్కడ నారీమణులు పూజింపబడుతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని భారతీయుల నమ్మకం.. అందుకనే ప్రతిరోజూ పూజిస్తాం, ఆరాధిస్తాం. అయితే ఆమెకంటూ ఓ రోజుండాలని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాం. మరి ఈ రోజుకు ఇంకా ఎలాంటి ప్రత్యేకతలున్నాయి? ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులేంటి?

ఆకాశంలో సగం… అవకాశాల్లో సగం… వినడానికి బాగానే ఉంది. కానీ లింగవివక్ష మహిళల సంఖ్య తగ్గిపోయేలా చేస్తోంది. ప్రపంచ జనాభా లెక్కలను చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఎందుకంటే పురుషుల జనాభాతో పోలిస్తే మహిళల జనాభా 63 కోట్లకుపైగా తక్కువ. మన దేశంలోనూ స్త్రీ, పురుష లింగనిష్పత్తి దారుణంగా పడిపోతోంది. అయితే ఎలాగైనా లింగ నిష్పత్తిలో సమానత్వం సాధించాలని మహిళలు కదం తొక్కారు. వారికి అండగా నిలిచింది ఐక్యరాజ్య సమితి. ఈ ఏడాది మహిళా దినోత్సవం థీమ్ ను లింగ నిష్పత్తిని పెంపొందించేలా రూపొందించింది. 2030 నాటికి భూమిపై సగం, సగం అనే థీమ్ ను ప్రకటించింది. అంటే లింగ నిష్పత్తిలో సమానత్వం సాధించేందుకు మరో 14 ఏళ్లు పడుతుంది.

మొదటి మహిళా దినోత్సవాన్ని మార్చి 19, 1911న నిర్వహించినప్పటి నుంచి ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవాలనుజరుపుకుంటూనే ఉన్నాం. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవాలని 1975లో ఐక్య రాజ్య సమితి నిర్ణయించడం ఈ ఉత్సవాలకు మరింత ఊతమిచ్చింది. ఆ తర్వాత నుంచి ప్రతి ఏటా మహిళా దినోత్సవానికి ఒక్కో ప్రత్యేకమైన థీమ్ ప్రకటిస్తోంది ఐక్యరాజ్య సమితి. ఆ లక్ష్యాన్ని చేరుకునే దిశగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.

మహిళలు ప్రవేశించని రంగమంటూ దాదాపుగా లేదు. అయినాసరే ఇప్పటికే మహిళల పట్ల చాలాచోట్ల పని ప్రదేశాల్లో వివక్ష కొనసాగుతోంది. శ్రమకు తగిన ప్రతిఫలం దక్కడం లేదు. పైగా పనిచేసే చోట మహిళలపట్ల లైంగిక వేధింపులు తప్పని దుస్థితి. మగువలపై అత్యాచారాలు, లైంగిక దాడులు, హత్యలు, వేధింపులు ఆగడం లేదు. ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా అతివలపై దాడులను మాత్రం అడ్డుకోలేకపోతున్నాయి. ఈ దేశం ఆ దేశం అనే తేడాలేదు. అభివ్రుద్ధి చెందిన దేశాల్లోనూ ఈ దారుణాలు ఆగకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

పోరాటాలు చేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సాధించుకున్న మహిళలు… తమపై జరుగుతున్న అన్యాయాలను ఎదిరిస్తూనే ఉన్నారు. ఇక లింగ వివక్ష పోవాలన్నా, తమపై వేధింపులు, దాడులు ఆగాలన్నా మరోపోరాటం చేయక తప్పని పరిస్థితి.

Also Read:

ఈ పంట వేస్తే.. సిరుల పంట.. 1 ఎకరంలో సాగు చేస్తే 30 కోట్లు… సాగు విధానం సహా పూర్తి వివరాలు

కరోనా వైరస్ వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై ప్రధాని మోదీ ఫోటోలను తొలగించండి, కేంద్రానికి ఈసీ ఆదేశం