AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Utah Health: అమెరికాలో కరోనా మహమ్మారికి ఏడాది పూర్తి.. ఉటా హెల్త్‌ యూనివర్సిటీలో పలు కీలక ఘట్టాలు..

University of Utah Health: గతేడాది కరోనా మహమ్మారి యావత్‌ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. కంటికి కనిపించని ఓ వైరస్‌ ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను కుప్పకులేలా చేసింది. ఇక ఆర్థికంగా, శాస్త్ర సాంకేతికంగా ఎంతో ఎత్తు ఎదిగిన...

Utah Health: అమెరికాలో కరోనా మహమ్మారికి ఏడాది పూర్తి.. ఉటా హెల్త్‌ యూనివర్సిటీలో పలు కీలక ఘట్టాలు..
Narender Vaitla
|

Updated on: Mar 06, 2021 | 11:22 AM

Share

University of Utah Health: గతేడాది కరోనా మహమ్మారి యావత్‌ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. కంటికి కనిపించని ఓ వైరస్‌ ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను కుప్పకులేలా చేసింది. ఇక ఆర్థికంగా, శాస్త్ర సాంకేతికంగా ఎంతో ఎత్తు ఎదిగిన దేశాలపై సైతం కరోనా తన పంజాను విసిరింది. భారీ ఎత్తున ప్రాణ నష్టం కలిగించింది. ప్రపంచం మొత్తంలో కరోనా కారణంగా ఎక్కువగా ప్రభావితమైన దేశాల్లో అమెరికా ఒకటి. అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉన్న అగ్రరాజ్యంలో సైతం కరోనా విలయతాండవం సృష్టించింది. ఇక అమెరికాలో కరోనాను సమగ్రవంతంగా ఎదుర్కొన్న సంస్థల్లో యూనివర్సిటీ ఆఫ్‌ ఉటా హెల్త్‌ ఒకటి. ఈ సంస్థలో తొలి కరోనా కేసు నమోదై మార్చి 5తో సరిగ్గా ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో ఈ హెల్త్‌ వర్సిటీలో ఎన్ని కేసులు నమోదయ్యాయి, టెస్టింగ్‌లు ఎన్ని జరిగాయి, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఎలా జరుగుతోంది లాంటి వివరాలపై ఓ లుక్కేద్దాం.. కరోనా వైరస్‌ అమెరికాలోకి ఎంటర్‌ అయిందని తెలియగానే యూనివర్సిటీ ఆఫ్‌ ఉటా అప్రమత్తమైంది. రోగులకు చికిత్స అందించే క్రమంలో అత్యంత చురుగ్గా స్పందించింది. అమెరికా ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించిన తర్వాత ఆసుపత్రి ఆవరణలో స్క్రీనింగ్‌ టెస్ట్‌ కోసం టెంట్లను ఏర్పాటు చేశారు. కోవిడ్‌ సోకిన వారి నుంచి ఇతరులకు వైరస్‌ సంక్రమించకుండా బయటకు వ్యక్తులను పూర్తిగా నిషేధించారు. అనంతరం ఉటా ఆసుపత్రి వర్గాలు కోవిడ్‌ పేషెంట్స్‌ కోసం ప్రత్యేకంగా బి-50 యూనిట్‌ను ఏర్పాటు చేశారు.

కరోనా పరీక్షలు..

ఉటా హెల్త్‌ వర్సిటీలో కరోనా పరీక్షలను మార్చి 12న మొదలు పెట్టారు. పెద్ద ఎత్తున కోవిడ్‌ టెస్ట్‌లు నిర్వహించారు. ఫిబ్రవరి 17, 2021 నాటికి సుమారు 3,23,000 మంది కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అంతేకాకుండా కరోనా టెస్టింగ్‌ కోసం ఆసుపత్రి వర్గాలు ప్రత్యేకంగా ఓ బస్సును కూడా ఏర్పాటు చేశారు. ఈ బస్సు ద్వారా పది నెలల్లో సుమారు 14,500 మందికి కరోనా పరీక్షలు చేశారు.

కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌..

ఇక కేవలం టెస్టింగ్‌, చికిత్సలోనే కాకుండా వ్యాక్సినేషన్‌ విషయంలో కూడా ఉటా హెల్త్‌ యూనివర్సిటీ వేగంగా స్పందించింది. అమెరికాకు చెందిన పైజర్‌ కంపెనీ వ్యాక్సిన్‌ పంపించడంతోనే వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రారంభించింది. ఈ క్రమంలోనే మొదట హెల్త్‌ కేర్‌ వర్కర్స్‌కు వ్యాక్సినేషన్‌ తొలుత ప్రారంభించారు. ఫిబ్రవరి 18 నాటికి ఇక్కడ సుమారు 17000 మందికి వ్యాక్సినేషన్‌ జరిగింది. ఇక కొత్త రకం వైరస్‌పై పరిశోధనలు నిర్వహించే క్రమంలో ఉటా హెల్త్‌ యూనివర్సిటీలు ఎన్నో వినూత్న నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా పలు కీలకమైన క్లినికల్ ట్రయల్స్‌ నిర్వహించింది. ఈ క్రమంలో సుమారు 130కిపైగా రీసెర్చ్‌ ప్రాజెక్టులను చేప్టటింది.

Also Read: Corona: దేశంలో తగ్గుతున్న కరోనా రికవరీల సంఖ్య.. నిన్న ఎన్ని కేసులు, మరణాలు నమోదయ్యాయంటే..?

Covid19 Vaccine Storage Freezer : కరోనా వైరస్ వ్యాక్సిన్ ను నిల్వ చేసుకునే సరికొత్త ఫ్రీజర్ లాంఛ్.. దీని స్పెషాలిటీస్ ఏమిటంటే

Covid Vaccination: జంతువులకు కూడా కరోనా వ్యాక్సినేషన్‌.. ప్రపంచంలోనే తొలిసారి..