Farmers Protest: 100వ రోజుకు చేరిన రైతుల ఆందోళనలు.. నల్లజెండాలు ఎగురవేయాలని ప్రజలకు పిలుపునిచ్చిన రైతు సంఘాలు..
Farmers Protest 100th Day: కేంద్రం ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో..
Farmers Protest 100th Day: కేంద్రం ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఆందోళనలు శనివారానికి(మార్చి 6) 100వ రోజుకు చేరుకున్నాయి. వంద రోజుల నిరసనకు గుర్తుగా కుండ్లి-మనేసర్-పాల్వార్(కెఎంపీ) ఎక్స్‌ప్రెస్ వేను దిగ్బంధించాలని రైతు సంఘాలు నిర్ణయించారు. ఈ మేరకు ప్రకటన కూడా విడుదల చేశాయి. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కెఎంపీ ఎక్స్‌ప్రెస్ వేని పూర్తిగా నిర్బంధిస్తామని యునైటెడ్ కిసాన్ మోర్చా నిరసనకారులు ప్రకటించారు. ఈ ఆందోళన కార్యక్రమం శాంతియుతంగా చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. సింఘ్ సరిహద్దు నుంచి కుండలి రీచ్ ఎక్స్‌ప్రెస్ వే మార్గాన్ని, ఖాజీపూర్ సరిహద్దు నుంచి దాస్నా టోల్ వైపు, టిక్కర్ సరిహద్దుకు సమీపంలో ఉన్న బహదూర్‌ఘర్ సరిహద్దు వరకు, షాజహన్‌పూర్ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులు గురుగ్రామ్-మనేసర్ వద్ద రోడ్డు మార్గాలను బ్లాక్ చేస్తామని ప్రకటించారు.
నిర్బంధంలో టోల్ ప్లాజా సమీపంలోని సరిహద్దులు.. ఘాజిపూర్ సరిహద్దులో నిరసన తెలుపుతున్న భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు రాజ్‌వీర్ సింగ్ జాడౌన్ దీనిపై ఈ నిరసన గురించి కీలక ప్రకటన చేశారు. రైతులు దాస్నా టోల్ సమీపంలో రోడ్డు బ్లా్క్ చేయడం జరుగుతుందిన, అలాగే.. హర్యానా యూపీ సరిహద్దుల్లో గల టోల్‌లన్నీ దుహాయ్, కస్నా, నోయిడా మొదలైన చోట్ల రైతులు రోడ్లను నిర్బంధించడం జరుగుతుందని చెప్పారు. ఈ టోల్ ప్లాజాలు శాంతియుతంగా మూసివేయబడతాయన్నారు. బాటసారుకు ఎలాంటి ఇబ్బంది కల్పించబోమన్నారు. అలాగే అత్యవసర సర్వీసులైన అంబులెన్స్, ఫైర్ బ్రిగేడ్ కారు, విదేశీ పర్యాటకులను ఆపబోమని రాజ్‌వీర్ సింగ్ జాడౌన్ తెలిపారు. ఇక మిలటరీ వాహనాలను కూడా ఆపబోమన్నారు.
దేశ ప్రజలకు రైతు సంఘాల అభ్యర్థన.. తమ ఉద్యమానికి మద్దతుగా ఇళ్ళు, కార్యాలయాల వద్ద నల్ల జెండాలు ఎగురవేయాలని దేశ ప్రజలను యునైటెడ్ కిసాన్ మోర్చా అభ్యర్థించింది. తమకు అండగా ఉండాలని కోరింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నల్ల జెండాలతో నిరసన తెలుపాలని పిలుపునిచ్చింది.
ఇదిలాఉంటే.. జనవరి 26న దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోట్ వద్ద రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో రైతు సంఘాల నేతలు అప్రమత్తం అయ్యారు. ముందుగానే నిరసనను శాంతియుతంగా చేపడతామని, ఇందులో ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవని స్పష్టమైన ప్రకటన చేస్తున్నారు.
Also read:
Summer Effect: ఇవి మామూలు కోతులు కాదండోయ్.. భక్తుల కోసం ఏర్పాటు చేస్తే వానర సేన వచ్చి ఏం చేసిందంటే..