ACB Caught Sarpanch: కాంప్లెక్స్ నిర్మాణాన్ని అడ్డుకున్నాడు.. చివరికి అడ్డంగా బుక్కయ్యాడు.. ఓ సర్పంచ్ కథలు ఇవి..!
ACB Caught Sarpanch: వికారాబాద్ జిల్లాలో ఓ అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కింది. పూడూరు మండలం మన్నెగూడ సర్పంచ్..
ACB Caught Sarpanch: వికారాబాద్ జిల్లాలో ఓ అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కింది. పూడూరు మండలం మన్నెగూడ సర్పంచ్ అవినీతి కేసులో అడ్డంగా దొరికిపోయాడు. ఓ వెంచర్ అనుమతి కోసం సర్పంచ్ వినోద్ గౌడ్ రూ. 13 లక్షలను డిమాండ్ చేశాడు. ఈ మేరకు వాటిని తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అప్పాజంక్షన్ దగ్గర డబ్బులు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు పక్కా స్కెచ్‌తో వినోద్‌ను దొరకబట్టారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలను ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ మీడియాకు వెల్లడించారు. ముజాహిద్ అలం ఖాన్ అనే వ్యక్తి మన్నెగూడలో 27 గుంటలు స్థలం లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నాడు. హెచ్ఎండిఎ నుండి అనుమతులు తీసుకుని మూడు నెలల క్రితం నిర్మాణం ప్రారంభించాడు. అయితే మన్నెగూడ సర్పంచ్ వినోద్ గౌడ్ బిల్డింగ్ నిర్మాణం పనులను అడ్డుకుంటూ వచ్చాడు.
షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలంటే తనకు రూ. 20 లక్షల రూపాయలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లంచం ఇచ్చేవరకు నిర్మాణాన్ని అడ్డుకుంటానని బెదిరింపులకు దిగాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో వినోద్‌ను పట్టుకునేందుకు అధికారులు పక్కా స్కెచ్ వేశారు. అందులో భాగంగా శుక్రవారం నాడు సాయంత్రం రూ.13 లక్షల రూపాయలు ఆర మైసమ్మ టెంపుల్ వద్ద సర్పంచ్ వినోద్ తీసుకుంటుడగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సర్పంచ్ వినోద్ పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ సత్యనారాయణ వెల్లడించారు. వైద్య పరీక్షల అనంతరం శనివారం ఉదయం మేజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తామని చెప్పారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే 1064 కి సమాచారం ఇవ్వాలని డీఎస్పీ తెలిపారు.
Also read:
Hooch Tragedy: కల్తీసారా ఘటనలో ఎక్సైజ్ కోర్టు సంచలన తీర్పు.. 9 మందికి మరణ శిక్ష.. మరికొంత మందికి..
Bolivia Students Fall: ప్రాణం మీదకు తెచ్చిన తొందరపాటు.. నాలుగో అంతస్తు నుంచి కిందపడిన విద్యార్థులు
Araku Bus Accident: అరకు బస్ ప్రమాదంలో నిగ్గు తేలిన నిజాలు.. తీగలాగితే దిమ్మతిరిగే వాస్తవాలు..