Araku Bus Accident: అరకు బస్ ప్రమాదంలో నిగ్గు తేలిన నిజాలు.. తీగలాగితే దిమ్మతిరిగే వాస్తవాలు..
Bus Accident: ముందు నుంచి అనుమానిస్తున్నట్టుగానే అరకు బస్ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని బయటపడింది. ఘటనపై విచారణ జరిపిన టెక్నికల్ టీమ్ కూడా ఇదే..
Driver’s Negligence: ముందు నుంచి అనుమానిస్తున్నట్టుగానే అరకు బస్ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని బయటపడింది. ఘటనపై విచారణ జరిపిన టెక్నికల్ టీమ్ కూడా ఇదే నిజమని తేల్చింది. దము ఘాట్ రోడ్డులో గత నెలలో జరిగిన ప్రమాదంపై విచారణ పూర్తయింది.
స్పాట్‌లో ప్రమాదాన్ని పరిశీలించిన అధికారులు.. తర్వాత కారణాలను విశ్లేషించారు. అందులో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ఘాట్ రోడ్డులో బస్సు నడిపిన అనుభవం డ్రైవర్‌కు లేకపోవడం ఒకటైతే.. బస్ ఫిట్‌నెస్ కూడా సరిగా లేదని గుర్తించారు.
బస్సు మెయింటెనెన్స్‌లో అనేక లోపాలను ఆర్టీఏ అధికారులు గుర్తించారు. బ్రేకులు అరిగిపోవడం ఓ కారణంగా తేల్చారు. బ్రెయిన్ ఫెయిల్యూర్ ఏ మాత్రం కాదన్న ఆర్టీఏ అధికారులు.. బ్రేకులు అరుగుదల వల్ల దిగేక్రమంలో సరిగా కంట్రోల్ చేయకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందన్నారు. ప్రమాదానికి ఏయే లోపాలు కారణం అన్న దానిపై ఆర్టీవో టెక్నికల్ ఎక్స్‌పర్ట్ శివప్రసాద్ చెప్పే మరిన్ని వివరాలను మా ప్రతినిధి ఖాజా అందిస్తారు.
గత నెల 12న జరిగిన ఈ ప్రమాదంలో దినేష్ ట్రావెల్‌కు చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో నలుగురు చనిపోగా.. 23 మంది వరకు గాయపడ్డారు. ప్రమాదానికి బస్సు డ్రైవర్‌తో పాటు యజమానికి కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో క్షతగాత్రులు కూడా డ్రైవర్ తప్పిదాన్నే ఎత్తిచూపారు. కానీ డ్రైవర్ మాత్రం బ్రేక్ ఫెయిల్ అయ్యాయన్నాడు. కానీ దర్యాప్తులో మాత్రం అవి బాగానే ఉన్నాయని, బస్సు ఫిట్‌నెస్సే సరిగా లేదని అన్నారు.
ఇవి కూడా చదవండి
Shanmukh Jaswanth: కౌన్సిలింగ్‌కు హాజరుకాని షణ్ముక్ జస్వంత్.. పోలీసులు సీరియస్..