Bride Died In Marriage: అత్తారింటికి బయలుదేరిన కొత్త పెళ్లికూతురు.. అంతలోనే అనంతలోకాలకు.. అసలేం జరిగిందంటే..
Bride Died In Marriage: ఎంతో వైభవంగా, బంధువుల సమక్షంలో ఆ అమ్మాయి వివాహం జరిగింది. ఇక మరుసటి రోజు అత్తారింటికి వెళ్లేందుకు సిద్ధమైందా కొత్త పెళ్లి కూతురు. కానీ అంతలోనే...
Bride Died In Marriage: ఎంతో వైభవంగా, బంధువుల సమక్షంలో ఆ అమ్మాయి వివాహం జరిగింది. ఇక మరుసటి రోజు అత్తారింటికి వెళ్లేందుకు సిద్ధమైందా కొత్త పెళ్లి కూతురు. కానీ అంతలోనే ఆమె అనంతలోకాలకు వెళ్లిపోయింది. పెళ్లి చేసుకొని కొత్త జీవితం ప్రారంభిద్దాం అనుకున్న ఆ కొత్త పెళ్లి కూతురుకు నూరేళ్లు నిండిపోయాయి.
వివరాల్లోకి వెళితే.. ఒడిశా రాష్ట్రంలోని సోనేపూర్ జిల్లాకు చెందిన మురళి సాహూ, మేనకా దంపతుల కుమార్తె గుప్తేశ్వరి సాహూకు రోసీ టెంటులు అనే గ్రామానికి చెందిన బిసికేసన్ ప్రధాన్ అనే యువకుడితో గురువారం వివాహం జరిగింది. ఇక వివాహ తంతు పూర్తయిన తర్వాత రోజు (శుక్రవారం) ఉదయం నూత వధువును అత్తారింటి పంపేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. సహజంగానే కొత్తగా పెళ్లయిన అమ్మాయి అత్తారింటికి వెళ్లే ముందు తన కుటుంబ సభ్యులను వదిలి వెళ్తున్నందుకు బాధతో ఏడుస్తుంటారు. అలాగే గుప్తేశ్వరి సాహూ కూడా బాధతో తీవ్రంగా ఏడిచింది. ఈ క్రమంలోనే అప్పగింతల కార్యక్రమంలో గుప్తేశ్వరి ఒక్కసారిగా కిందపడిపోయింది. దీంతో ఆందోళన చెందిన కుటంబ సభ్యులు వెంటనే వధువును స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యులు గుప్తేశ్వరి అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. అంతేకాదు అప్పగింతల సమయంలో అతిగా ఏడవడం వల్ల గుండెపోటు వచ్చిందని తేల్చారు. దీంతో ఆ పెళ్లింట ఒక్కసారిగా విషాదం నెలకొంది. సంతోషంగా వివాహం చేసుకున్న కూతురు విగత జీవిగా మారడంలో గుప్తేశ్వరి తల్లిదండ్రులు విలపించారు. తమ కూతురు కేవలం నీరసం వల్లే పడిపోయుందని భావించామని, ఇలా జరుగుతుందని అస్సులు ఊహించలేదంటూ తల్లిదండ్రులు విచారించారు. వధువు మృతి రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
Also Read: AP Crime News : కాపాడాలని వేడుకుంటే కడతేర్చాడు.. సొంత భార్యనే ఉరేసి చంపిన అనుమానపు భర్త..