భర్తలో లోపం ఉందంటాడు.. సంతానం కావాలంటే తాను చెప్పింది వినాలంటాడు.. కృష్ణా జిల్లాలో కంత్రీ డాక్టర్

సంతానం కావాలంటే తాను చెప్పింది వినాలంటున్నాడు ఓ వైద్యుడు.. నీ భర్తలో లోపం ఉందంటూ తన నిజ స్వరూపాన్ని బయట పెట్టాడు. దీంతో వైద్యుడి రోగం కుదుర్చేందుకు పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు.

  • Ram Naramaneni
  • Publish Date - 9:00 pm, Fri, 5 March 21
భర్తలో లోపం ఉందంటాడు.. సంతానం కావాలంటే తాను చెప్పింది వినాలంటాడు.. కృష్ణా జిల్లాలో కంత్రీ డాక్టర్

సంతానం కావాలంటే తాను చెప్పింది వినాలంటున్నాడు ఓ వైద్యుడు.. నీ భర్తలో లోపం ఉందంటూ తన నిజ స్వరూపాన్ని బయట పెట్టాడు. దీంతో వైద్యుడి రోగం కుదుర్చేందుకు పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. వైద్యుడిని దేవుడితో సమానంగా చూస్తాం.. ఏ సమస్య వచ్చినా చెప్పుకుంటాం.. అయితే కొందరు వైద్యులు మాత్రం ఇదే అదనుగా భావించి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. కృష్ణా జిల్లాలో ఓ డాక్టర్‌పై పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది ఓ బాధితులు. తనను లైంగికంగా వేధించాడని, అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేసింది. తన ఆరోపణలకు సబంధించిన కొన్ని ఆధారాలను కూడా సమర్పించింది.

కృష్ణా జిల్లా మొవ్వలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు సొంటి శివరామకృష్ణ. మరోవైపు కంకిపాడు మండలం గోసాలలో ఓ ప్రైవేట్‌ క్లినిక్‌ను నిర్వహిస్తున్నాడు. అయితే ఈడుపుగల్లుకు చెందిన ఓ వివాహిత గైనిక్‌ సమస్యతో ఆసుపత్రికి రాగా, ఆమెపై కన్నేశాడు శివరామకృష్ణ. వైద్యం పేరుతో ఫోన్‌లు చేస్తూ వ్యక్తిగత విషయాలు అడగడం మొదలు పెట్టాడు. ఎలాగైనా ఆమెను లొంగదీసుకోవాలని, ఆమె భర్తకు లోపం ఉందని, పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పాడు. అంతేకాదు పిల్లలు కావాలంటే తాను చెప్పినట్టు వినాలని ఆమెను మభ్యపెట్టే ప్రయత్నం చేశాడు. దీంతో విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ జరుపుతున్నామని కంకిపాడు పోలీసులు తెలిపారు. బాధితురాలు కొన్ని ఆధారాలను సమర్పించిందని, వాటిని పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. అయితే స్థానికులు మాత్రం డాక్టర్‌ శివరామకృష్ణపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన ఎవరినీ కించపరిచేలా మాట్లాడటం చూడలేదంటున్నారు. కేవలం అవగాహనా లోపంతోనే కొందరు డాక్టర్‌ శివరామకృష్ణపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. తమకు తెలిసినంత వరకు ఆయనపై ఇప్పటి వరకు ఎలాంటి ఆరోపణలు రాలేదంటున్నారు.

Also Read:

వీళ్లు కొత్తరకం దొంగలు.. పెళ్లికి వస్తారు.. బహుమతులు కొట్టేస్తారు.. పక్కా స్కెచ్‌తో

అక్కడి పెట్రోల్ బంకుల్లో కొత్త తరహా మోసం.. మీటర్ “0”నే ఉంటుంది… కానీ.. మీరు కూడా ఇలా మోసపోతున్నారా..?