AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్కడి పెట్రోల్ బంకుల్లో కొత్త తరహా మోసం.. మీటర్ “0”నే ఉంటుంది… కానీ.. మీరు కూడా ఇలా మోసపోతున్నారా..?

పెట్రోల్ బంకుల్లో ఆపరేటర్లు పాల్పడే మోసాలకు లెక్కేలేదు. కన్ను తిప్పేలోపే మాయ చేసేస్తారు. ఎన్ని ఫిర్యాదులు వెళ్లినా అధికారులు ఏవో చర్యలతో సరిపెట్టేస్తుంటారు.

అక్కడి పెట్రోల్ బంకుల్లో కొత్త తరహా మోసం.. మీటర్ 0నే ఉంటుంది... కానీ.. మీరు కూడా ఇలా మోసపోతున్నారా..?
పెట్రోల్ బంకుల్లో మోసం
Ram Naramaneni
|

Updated on: Mar 05, 2021 | 6:57 PM

Share

పెట్రోల్ బంకుల్లో ఆపరేటర్లు పాల్పడే మోసాలకు లెక్కేలేదు. కన్ను తిప్పేలోపే మాయ చేసేస్తారు. ఎన్ని ఫిర్యాదులు వెళ్లినా అధికారులు ఏవో చర్యలతో సరిపెట్టేస్తుంటారు. మళ్లీ యథామామూలే. అంతిమంగా కస్టమర్లు నష్టపోవడమే కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మరో రకమైన మోసం కూడా జరుగుతోంది. మీటర్ చూడ్డానికే 0కి వెళుతుంది. కానీ నిజంగా వెళ్లదు. అది కేవలం మీటర్ రీడింగ్ పరంగా చేసే సాంకేతిక మాయాజాలం. అందుకోసం వారు ప్రత్యేక పరికరాలను ఏర్పాటు చేసుకుంటారు.

ఖమ్మం నగరంలో జరిగే పెట్రోల్‌ మెసాలు అన్నీ ఇన్నీ కావు..భారిగా దండుకుంటున్న పెట్రోల్‌ బంక్‌ యాజమాన్యం, ప్రశ్నిస్తే పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారు.. ఈ క్రమంలోనే ఖమ్మం నగరంలో ఓ యువకుడు పల్సర్‌ బైక్‌ ను ఫుల్‌ ట్యాంక్‌ చెయ్యమన్నాడు.. బంక్‌లో పని చేసే వ్యక్తి బైక్‌ ఫుల్‌ ట్యాంక్‌ చేసి 18 లీటర్లకు బిల్‌ ఇచ్చాడు. బైక్‌ యజమాని పల్సర్‌ బైక్‌ పెట్రోల్‌ ట్యాంక్‌ కెపాసిటి 15 లీటర్లు మాత్రమే 18 లీటర్లు ఎలా వచ్చింది… అంతకు ముందు దాదాపు రెండు లీటర్ల పెట్రోల్‌ బైక్‌లో ఉందని ప్రశ్నించడంతో బంక్‌ డొల్లతనం బయట పడింది.

బైక్‌ యజమాని బంక్‌ నిర్వాసితులను ప్రశ్నిస్తే సమాధానం దాటవేయడంతో బైక్ లో ఉన్న పెట్రోల్ ను కాలి డబ్బాలో పోసి చూస్తే…అది 18 లీటర్లు రాలేదు.. వెంటనే బంక్‌ యజమాని తనకు ఉన్న అండ దండలతో పోలీసులను రప్పించి వారిని అక్కడి నుండి పంపించే ప్రయత్నం చేశాడు.. మరో బైక్‌ యజమాని ఫుల్‌ ట్యాంక్‌ చెయ్యమని అడగగా అతని బైక్‌లో 18 లీటర్ల పెట్రోల్‌ కొట్టారు. ఆ బైక్‌ యజమాని కూడ తన బైక్‌లో ఉన్న పెట్రోల్‌ను కాలి డబ్బాలో కొలత వేస్తుండగా బంక్‌ కు సంబందించిన వారు అక్కడి నుండి జారుకున్నారు.

పెట్రోల్‌ బంక్‌లో ఇంత జరుగుతున్నా తూనికలు, కొలతల వారు కానీ, సంబంధిత అధికారులు గానీ, స్పందించకపోవటం, ఎటువంటి తనిఖీలు జరపకపోవటం పట్ల వాహనదారులు, ఖమ్మం పట్టణ ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Also Read:

ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద స్కార్పియో కేసులో సంచలనం.. కారు ఓనర్ అనుమానాస్పద మృతి

వీళ్లు కొత్తరకం దొంగలు.. పెళ్లికి వస్తారు.. బహుమతులు కొట్టేస్తారు.. పక్కా స్కెచ్‌తో