పెళ్లి సమయంలో బట్టతలను దాచిన భర్త.. ఏడాది తర్వాత విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన భార్య

ఒక మహిళ తన బట్టతల దాచిపెట్టినందుకు భర్త నుండి విడాకులు కోరుతూ కుటుంబ కోర్టుకు వచ్చింది.

  • Balaraju Goud
  • Publish Date - 5:48 pm, Fri, 5 March 21
పెళ్లి సమయంలో బట్టతలను దాచిన భర్త.. ఏడాది తర్వాత విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన భార్య

UP woman seeks divorce : పెళ్లికి ముందు చెడు అలవాట్లకు దగ్గరవుతారు. అయితే, పెళ్లి సమయం వచ్చేసరికి కాబోయే భార్య, భర్త దగ్గర ఇలాంటి విషయాలను దాచిపెట్టేస్తుంటారు. కానీ వివాహం అనంతరం ఎదో ఒకరోజు మనకు సంబంధించిన రహస్యాలు వారికి తెలిస్తే ఎలా ఉంటుందో తెలుసా.. అచ్చం ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

బ్రహ్మనందం నటించిన టాటా బిర్లా మధ్యలో లైలా చిత్రం గుర్తుందా? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అదే సీన్ రిఫీట్ అయ్యింది. బుధవారం ఒక మహిళ తన బట్టతల దాచిపెట్టినందుకు భర్త నుండి విడాకులు కోరుతూ కుటుంబ కోర్టుకు వచ్చింది. ఇక్కడ చెప్పబోయే మహిళకు కేవలం అబద్దం చెప్పాడనే సంగతి తెలిసింది. ఇంకేముంది అది పెద్దదా చిన్నదా అనే విషయాన్ని పక్కనపెట్టి రచ్చకెక్కింది. పెండ్లికి ముందు భర్త తనకు బట్టతల ఉన్నదన్న విషయం దాచినందుకు ఏకంగా అతనికి విడాకులిచ్చేందుకు సిద్ధమమైంది సదరు భార్య.

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి 2020 జనవరిలో ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే సరిగ్గా ఏడాదికి అతడికి బట్టతల ఉన్న విషయం భార్యకు తెలిసింది. దీంతో పెళ్లి సమయంలో జుట్టు ఒత్తుగానే ఉంది కదా. ఇప్పుడిలా జుట్టు ఊడిపోయిందేని భర్తను నిలదీసింది. దీంతో అతడు తనకు ముందు నుంచే బట్టతల ఉందని అసలు విషయం బయటపెట్టాడు. పెళ్లిలో విగ్గు పెట్టుకుని కవర్‌ చేశానని చెప్పుకొచ్చాడు. అది విన్న మహిళకు చిరెత్తుకొచ్చింది. భర్త తనను మోసం చేశాడని అతని నుంచి విడాకులు ఇప్పించాలని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది.

తనకు బట్టతల ఉందని భర్త ఎన్నడూ చెప్పలేదని, ఈ విషయం చెప్పనందున భర్త నుంచి విడాకులు కోరుతున్నానని పేర్కొన్నారు. తన ఫ్రెండ్స్ ముందు అవమానానికి గురయ్యానని, ఎలాగైనా తనకు భర్త నుంచి విడాకులు కావాల్సిందేనని కోరింది. అయితే, ఆమెకు నచ్చజెప్పేందుకు కుటుంబసభ్యులు ప్రయత్నిస్తున్నారు. వివాహ కౌన్సెలింగ్ కేంద్రంలోని అధికారులు ఆమెను శాంతింపచేయడానికి ప్రయత్నించారు. ఇలాంటి చిన్నవిషయం కోసం విడాకులు తీసుకోకుండా ఆమెను ఒప్పించేందుకు చూశారు. అయినప్పటకీ ఆ మహిళ నిరాకరించింది. ఇప్పటికే ఒకమారు కౌన్సిలింగ్ పూర్తైంది. ఇప్పటికేనా ఆమె మనస్సులో మార్పు వస్తుందనే ఆశతో దంపతులకు రెండవ రౌండ్ కౌన్సెలింగ్ కోసం మరో తేదీ ఇచ్చారు అధికారులు.

Read Also…  CBSE Board Exam 2021: సీబీఎస్ఈ 10,12 పరీక్ష షెడ్యూల్ లో స్వల్ప మార్పులు.. జూన్ 14న ముగియనున్న ఎగ్జామ్స్