CBSE Board Exam 2021: సీబీఎస్ఈ 10,12 పరీక్ష షెడ్యూల్ లో స్వల్ప మార్పులు.. జూన్ 14న ముగియనున్న ఎగ్జామ్స్

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) మరోసారి వార్షిక పరీక్షా తేదీల్లో మార్పులు చేసింది. 10, 12 తరగతుల పరీక్షల తేదీల్లో పలు మార్పులు చేస్తూ తుది తేదీలను ప్రకటించింది.

CBSE Board Exam 2021: సీబీఎస్ఈ 10,12 పరీక్ష షెడ్యూల్ లో స్వల్ప మార్పులు.. జూన్ 14న ముగియనున్న ఎగ్జామ్స్
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 05, 2021 | 5:18 PM

CBSE Board Exam 2021: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) మరోసారి వార్షిక పరీక్షా తేదీల్లో మార్పులు చేసింది. 10, 12 తరగతుల పరీక్షల తేదీల్లో పలు మార్పులు చేస్తూ తుది తేదీలను ప్రకటించింది. ఇందుకోసం నూతన డేట్ షీట్ ను బోర్డు విడుదల చేసింది. 12 వ తరగతి మాథ్స్ పరీక్ష గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జూన్ 1న నిర్వహించాల్సి ఉండగా, మే1వ తేదీకి మార్చారు. ఫిజిక్స్ పరీక్షను మే 13కు బదులుగా 8న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతికి సంబంధించి సైన్స్ పరీక్షను జూన్ 2కు బదులుగా మే 21న నిర్వహించనున్నారు. 10వ తరగతికి సంబంధించి పరీక్ష ప్రారంభమయ్యే, ముగిసే తేదీల్లో ఎలాంటి మార్పులు లేవని అధికారులు స్పష్టం చేశారు.

సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు మే 4న ప్రారంభమై, జూన్ 7న ముగియనున్నాయి. అయితే, 12 వ తరగతి పరీక్షలు మే 4న మొదలు కానున్నాయి. అయితే, పాత షెడ్యూల్ ప్రకారం జూన్ 11న ఈ పరీక్ష ముగియనుండగా జూన్ 14న పరీక్షలు మగిసేలా నూతన షెడ్యూల్ ను రూపొందించారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ cbse.nic.in నుం సందర్శించాలని బోర్డు సూచించింది.

ఇదిలా ఉంటే.. జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్(JEE Main 2021) మార్చి సెషన్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 2 ప్రారంభమైంది. అయితే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 6న ముగియనుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు jeemain.nta.nic.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. అయితే, సమయం తక్కువ ఉండడంతో తప్పులు సవరించుకోవడానికి కరెక్షన్ విండోను అభ్యర్థులను అందుబాటులో ఉంచా నేషనల్ టెస్ట్ ఏజెన్సీ.

కాగా, సాధారణంగా, ప్రాక్టికల్ పరీక్షలు జనవరిలో నిర్వహిస్తారు. రాత పరీక్షలు ఫిబ్రవరిలో ప్రారంభమై మార్చిలో ముగుస్తాయి. అయితే, కోవిడ్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని పరీక్షలు ఈ సెషన్‌ను ఆలస్యంగా మొదలవుతున్నాయి. 2021 లో బోర్డు పరీక్షలు ఆన్‌లైన్‌లో కాకుండా లిఖిత రీతిలో నిర్వహిస్తామని సీబీఎస్‌ఈ ఈ నెల ప్రారంభంలో ప్రకటించింది. అయితే, కోవిడ్ వ్యాప్తిని నియంత్రించడానికి దేశవ్యాప్తంగా పాఠశాలలు మార్చిలో మూసివేశారు. అక్టోబర్ 15 నుండి కొన్ని రాష్ట్రాల్లో వీటిని పాక్షికంగా తిరిగి తెరిచారు.

ఇదీ చదవండిః Senior Citizen Darshan in Tirumala : శ్రీవారి దర్శనానికి వృద్ధులకు ప్రత్యేక సదుపాయాలు.. అవిఏమిటో తెలుసుకుంటే దర్శనం చాలా ఈజీ