PG ECET-2021 : ఈ నెల 6న పీజీఈసెట్ నోటిఫికేషన్ .. ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్వీకరిస్తారంటే..?

PG ECET-2021 : పీజీఈసెట్ 2021 నోటిఫికేషన్ ను ఈనెల 6న విడుదల చేస్తున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి తెలిపారు. జూన్ 19 నుంచి 22 వరకు కంప్యూటర్

PG ECET-2021 : ఈ నెల 6న పీజీఈసెట్ నోటిఫికేషన్ .. ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్వీకరిస్తారంటే..?
TS PGECET-2021
Follow us

|

Updated on: Mar 05, 2021 | 6:36 PM

PG ECET-2021 : పీజీఈసెట్ 2021 నోటిఫికేషన్ ను ఈనెల 6న విడుదల చేస్తున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి తెలిపారు. జూన్ 19 నుంచి 22 వరకు కంప్యూటర్ బెస్డ్ టెస్ట్ రెండు సెషన్స్ లో నిర్వహిస్తామన్నారు. ఇందుకు సంబంధించి ఈ నెల 12 నుంచి ఆన్ లైన్ లో అప్లికేషన్లను స్వీకరించనుండగా చివరి తేదీ ఏప్రిల్ 30గా ప్రకటించారు. అప్లికేషన్ ధర జనరల్ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.500గా నిర్ణయించారు. జూన్ 15 వరకు లేట్ ఫీజుతో అప్లికేషన్లు స్వీకరిస్తారు. హాల్ టికెట్లను జూన్ 10 నుంచి 18 వరకు డౌన్ లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు 120 ప్రశ్నలను 2గంటల్లో సమాధానం ఇవ్వాలి. పూర్తి వివరాల కోసం www.tsche.ac.in వెబ్ సైట్ ను సంప్రదించాల్సిందిగా సూచించారు.

ఉన్నత విద్యామండలి మొత్తం 7 కోర్సుల్లో ప్రవేశానికి పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కీలకమైన ఎంసెట్‌, ఈసెట్‌, పీజీసెట్‌ ల ప్రవేశానికి పరీక్ష తేదీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి గాను తెలంగాణ ఎంసెట్ పరీక్షలు జూలై 5 నుంచి 9 వరకు జరగనున్నాయి. ఈ ప్రవేశ పరీక్షలను హైదరాబాద్ జేఎన్‌టీయూ నిర్వహిస్తుందని.. ప్రొఫెసర్ ఎ గోవర్ధన్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారని తెలిపారు.

ఇదిలా ఉంటే.. తెలంగాణ ఎడ్‌సెట్‌ ప్రవేశ పరీక్ష విధానంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మార్పులు చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పరీక్ష ప్రశ్నపత్ర సిస్టమ్‌కు గ్రీన్‌‌సిగ్నల్ ఇచ్చింది. కంప్యూటర్‌ విద్యకు సంబంధించిన అంశాలను చేరుస్తూ టెస్ట్‌ కమిటీ చేసిన సిఫారసులను తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఎడ్‌సెట్‌ కమిటీ నిర్ణయం మేరకు మార్చుతున్నట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు లాసెట్‌, పీజీలాసెట్‌, టీఎస్‌పీఈసెట్‌ పరీక్షల షెడ్యూల్‌ నిర్ణయించాల్సి ఉంది.

కుండలోని నీరు తాగండి కూల్‌గా ఉండండి.. ఎన్ని లాభాలో తెలిస్తే ఫ్రిజ్ వాటర్‌ని ఇప్పుడే వదిలేస్తారు..

ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..