Mukesh Ambani: ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద స్కార్పియో కేసులో సంచలనం.. కారు ఓనర్ అనుమానాస్పద మృతి

ముఖేష్ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలతో వదిలిపెట్టిన స్కార్పియో ఎస్‌యూవీ యజమాని చనిపోవడం కలకలం రేపుతోంది. అతడిని ఎవరైనా చంపేశారా..?

  • Ram Naramaneni
  • Publish Date - 5:44 pm, Fri, 5 March 21
Mukesh Ambani: ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద స్కార్పియో కేసులో సంచలనం.. కారు ఓనర్ అనుమానాస్పద మృతి
అంబానీ ఇంటి వద్ద స్కార్పియో కేసులో ట్విస్ట్: కారు ఓనర్ అనుమానాస్పద మృతి

ముఖేష్ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలతో వదిలిపెట్టిన స్కార్పియో ఎస్‌యూవీ యజమాని చనిపోవడం కలకలం రేపుతోంది. అతడిని ఎవరైనా చంపేశారా..? లేదా ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. సదరు కారు యజమాని మన్​సుఖ్​ హీరేన్ మృతదేహాన్ని పోలీసులు థానేలో గుర్తించారు. అయితే ఆయన మృతికి గల కారణాలు విచారణలో తెలియనున్నాయి.

ప్రముఖ బిజినెస్‌మేన్ ముకేశ్​ అంబానీ ఇంటికి సమీపంలో పేలుడు పదార్థాలతో పాటు వార్నింగ్ లెటర్‌తో ఉన్న కారు కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆ కారు కొంతకాలం క్రితం చోరీకి గురైందని అధికారులు వెల్లడించారు. ఆ కారు అసలు ఓనర్ హిరెన్​ మన్​సుఖ్​..  దీనిపై కంప్లైంట్ చేసినట్లు చెప్పారు.  అంబానీ ఇంటికి దగ్గర్లో పార్కు​ చేసి ఉన్న కారు దృశ్యాలు చూసిన తర్వాత మన్​సుఖ్​.. పోలీసు కమిషనర్ ఆఫీసుకు వచ్చారని చెప్పారు.

ఠాణె జిల్లాకు చెందిన మాన్​సుఖ్​.. ఫిబ్రవరి 17న ఓ ఫంక్షన్‌కు వెళ్తుండగా కారు చెడిపోవడం వల్ల ఐరోలీ ములుండ్​ బ్రిడ్జ్​ దగ్గర్లో పార్కు చేశారు. తర్వాత రోజు కారును తెచ్చుకోవడానికి వెళ్లగా.. అక్కడ అది కనిపించలేదు. నాలుగు గంటలు పాటు వెతికిన తర్వాత కారు పోయినట్లు గుర్తించి.. పోలీసులకు కంప్లైంట్  చేశానని మన్​సుఖ్​ చెప్పారు.

Also Read:

Tollywood Top Hero Son: ఈ టాలీవుడ్ టాప్ హీరో తనయుడు ఎవరో గుర్తుపట్టగలరా..? ఎనీ గెస్…?

ఏపీ మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై నాన్​‌బెయిలబుల్ వారెంట్‌