AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ఏపీ మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై నాన్​‌బెయిలబుల్ వారెంట్‌

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, సత్తెనపల్లి శాసనసభ్యుడు అంబటి రాంబాబులపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.

Breaking News : ఏపీ మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై నాన్​‌బెయిలబుల్ వారెంట్‌
మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై నాన్​‌బెయిలబుల్ వారెంట్‌
Ram Naramaneni
|

Updated on: Mar 05, 2021 | 4:48 PM

Share

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, సత్తెనపల్లి శాసనసభ్యుడు అంబటి రాంబాబులపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. హెరిటేజ్‌ సంస్థ వేసిన పరువు నష్టం కేసులో.. కన్నబాబు, అంబటి రాంబాబు విచారణకు హాజరు కాలేదు. దీంతో ఈ కేసులో ఇద్దరిపైనా  హైదరాబాద్​ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు ఎన్​డబ్యూ (నాన్‌బెయిలబుల్ వారెంట్‌) జారీ చేసింది.  వచ్చే వాయిదాకు తప్పనిసరిగా రావాల్సిందేనని ధర్మాసనం ఆదేశించింది.  తదుపరి విచారణ ఈ నెల 24కి వాయిదా వేసింది.

గతంలో హెరిటేజ్ సంస్థపై కన్నబాబు, అంబటి వ్యాఖ్యలు చేశారంటూ ఆ కంపెనీ పరువునష్టం దావా వేసింది. దీనికి సంబంధించిన విచారణ ప్రజాప్రతినిధుల కోర్టులో జరుగుతుండగా, ఇరువురు వైఎస్సార్సీపీ నాయకులు విచారణకు హాజరుకాలేదు. ఫిబ్రవరి 5న వారిద్దరూ విచారణకు రావాలని కోర్టు ఆదేశించినా.. వారు నిర్లిప్తత వహించారు. మరోవైపు, గత వాయిదా సమయంలో హెరిటేజ్ ఆఫిసర్ సాంబమూర్తి కూడా విచారణకు గైర్హాజరవడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాగైతే కేసు ముందుకు వెళ్లడం కష్టమని గత విచారణలో స్పష్టం చేసింది.  ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు ఉన్నాయో.. వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే.

జనవరి నెలలో తొలుత ఈ కేసులో కోర్టు విచారణ జరిపింది.  ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలు కన్నబాబు, అంబటి రాంబాబు హాజరుకాకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణ అనగా ..ఫిబ్రవరి 5న జరిగే విచారణకు హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా వ్యక్తిగత పూచీకత్తు, రూ.5 వేలతో రెండు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. అయినా కోర్టు ఆదేశాలను పాటించకపోవడంతో మంత్రితో పాటు ఎమ్మెల్యేపై నాన్-బెయిల‌బుల్ వారెంట్ జారీ చేసింది.

Also Read:

 రిసార్ట్ లో కల్లు తాగిన సింగర్ సునీత ..! సోషల్ మీడియాలో ఫోటో వైరల్

 భర్తను కోల్పోయిన టీచర్‌కు స్టూడెంట్ ఓదార్పు లేఖ.. నెట్టింట వైరల్‌గా మారిన పోస్ట్.!

ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు
మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు