AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jagan New Gift: ఏపీ విద్యార్థినులకు సీఎం జగన్ బంపర్ గిఫ్ట్.. మహిళా దినోత్సవం రోజునే కొత్త పథకాలు ప్రారంభం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోని విద్యార్థినులకు రెండు సిగ్నిఫికేంట్ గిఫ్టులను ప్రకటించారు. రెండు కొత్త పథకాలను మార్చి 8వ తేదీ మహిళా దినోత్సవం రోజునే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని

Jagan New Gift: ఏపీ విద్యార్థినులకు సీఎం జగన్ బంపర్ గిఫ్ట్.. మహిళా దినోత్సవం రోజునే కొత్త పథకాలు ప్రారంభం
Rajesh Sharma
|

Updated on: Mar 05, 2021 | 6:03 PM

Share

AP CM Jagan New Gift to Girl Students: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోని విద్యార్థినులకు రెండు సిగ్నిఫికేంట్ గిఫ్టులను ప్రకటించారు. రెండు కొత్త పథకాలను మార్చి 8వ తేదీ మహిళా దినోత్సవం రోజునే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆయన అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రాష్ట్రంలో అమలవుతున్న మహిళా సంక్షేమంపై శుక్రవారం సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండు క్రూషియల్ నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల బాలికలకు ఉచితంగా శానిటరీ నేప్‌కిన్స్‌ పంపిణీ చేయాలని సీఎం సమీక్ష సందర్భంగా ఆదేశించారు. ప్రభుత్వ విద్యాసంస్ధల్లో చదువుతున్న 7 నుంచి 12 తరగతి వరకు విద్యార్ధినులకు శానిటరీ నేప్‌కిన్స్‌ పంపిణీపై కీలక నిర్ణయం తీసుకున్నారు. 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్ధినులకు బ్రాండెడ్ కంపెనీలకు చెందిన శానిటరీ నేప్‌కిన్స్‌ను ఉచితంగా పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ విద్యాసంస్దల్లో బాలికలకు శానిటరీ నేప్‌కిన్స్‌ పంపిణీపై విద్య, వైద్య, ఆరోగ్యం, మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు.

బాలికల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలని ముఖ్యమంత్రి అధికారులకు తెలిపారు. మార్చి 8 (మహిళా దినోత్సవం రోజున) ఉచిత శానిటరీ నేప్‌కిన్స్‌ పంపిణీ పథకాన్ని ప్రారంభించాలని నిర్దేశించారు. ఏప్రిల్‌ 15 నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ఏప్రిల్‌ నెలాఖరునాటికి ప్రతిష్టాత్మకమైన కంపెనీలతో సెర్ప్, మెప్మా ఎంఓయూ చేసుకుంటామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ స్కూల్స్, జూనియర్‌ కళాశాలలు, గురుకుల పాఠశాలల విద్యార్ధినులకు శానిటరీ నేప్‌కిన్స్‌ పంపిణీ చేయనున్నారు.

జూలై 1 నుంచి ప్రతినెలా ఉచితంగా శానిటరీ నేప్‌కిన్స్‌ పంపిణీ కార్యక్రమం మొదలవుతుంది. నెలకి 10 చొప్పున ఏడాదికి 120 శానిటరీ నేప్‌కిన్స్‌ ప్రతీ విద్యార్థినికి పంపిణీ చేయనున్నారు. దీనికోసం సుమారు రూ. 41.4 కోట్లను ప్రభుత్వం కేటాయించనున్నది. మరోవైపు రాష్ట్రంలోని పేద మహిళలకు చేయూత కిరాణా స్టోర్స్‌లో తక్కువ ధరకే శానిటరీ నేప్‌కిన్స్‌ పంపిణీ చేయనున్నారు. దీంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో చేయూత కిరాణా స్టోర్స్‌ ద్వారా అందుబాటులో తక్కువ ధరకే శానిటరీ నేప్‌కిన్స్‌ అందుబాటులోకి రానున్నాయి. చేయూత స్టోర్స్‌లో అందుబాటు ధరల్లో బ్రాండెడ్ కంపెనీల శానిటరీ నేప్‌కిన్స్‌ పంపిణీ చేయాలని తలపెట్టారు. దీనికోసం శానిటరీ నాప్‌కిన్స్‌ తయారీలో అత్యుత్తమ కంపెనీలతో మెప్మా మరియు సెర్ప్‌ ఎంఓయూ చేసుకోనున్నారు.

విద్యార్ధినులకు అన్ని రకాల పోటీ పరీక్షలకోసం అత్యుత్తమ శిక్షణ శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి విద్యాశాఖ అధికారులకు నిర్దేశించారు. దీనికోసం లాప్‌టాప్‌లను వాడుకోవాలని సీఎం తెలిపారు. అమ్మఒడి పథకంలో లాప్‌టాప్‌లు పంపిణీ చేయనున్నారు. 9 తరగతి ఆపైన విద్యార్ధులకు ఇప్పటికే ఆప్షన్‌ ఇచ్చామని సీఎం తెలిపారు. ప్రభుత్వం ఇస్తున్న కంప్యూటర్స్‌తో పాటు రెప్యూటెడ్‌ సంస్ధలు (కోచింగ్‌ ఇనిస్టిట్యూషన్స్‌) సహకారం తీసుకునే దిశగా ప్రణాళిక రచించాలని అధికారులకు సీఎం ఆదేశాలిచ్చారు. విద్యార్ధుల నుంచి ల్యాప్‌టాప్‌ల ఆప్షన్‌ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని చెప్పారు. ల్యాప్‌టాప్‌ల సహకారంతో కోచింగ్‌ ఇవ్వాలని, ఇంటరాక్టివ్‌ విధానంలో, టెక్నాలజీని ఉపయోగించుకుంటూ నైపుణ్యాలను పెంచాలన్నారు. ఇందుకోసం ఎంపిక చేసిన నిపుణుల సహకారం తీసుకోవాలని చెప్పారు. దీని ద్వారా వీలైనంత ఎక్కువ మంది విద్యార్ధినులను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసే కార్యక్రమాన్ని రూపొందించాలని ఆదేశించారు. లాప్‌టాప్‌లను విద్యార్ధినులకు ఇచ్చే సమయానికి దాన్ని గరిష్టంగా వాడుకుని ఎలా లబ్ధి పొందవచ్చో ప్రణాళిక రూపొందించాలన్నారు.

ALSO READ: కరోనా వైరస్ వైఫైలాగా మన చుట్టే వుంది..  సీసీఎంబీ తాజా హెచ్చరిక

ALSO READ: ఆరేళ్ళలో ఎన్నో బందులు.. కానీ నేటిది మాత్రం ప్రత్యేకమే!

ALSO READ: ఇపుడు అందరి కళ్ళు ఆయనపైనే.. ఎందుకంటే సడన్‌గా సీఎం కేండిడేట్ అయ్యాడు కదా!