Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందుకే అప్పులు చేయాల్సి వచ్చింది.. కరోనా వల్ల ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతింది -బుగ్గన

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా ఆదాయం పడిపోయిందిని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

అందుకే అప్పులు చేయాల్సి వచ్చింది.. కరోనా వల్ల ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతింది -బుగ్గన
Buggana
Follow us
K Sammaiah

|

Updated on: Mar 05, 2021 | 5:54 PM

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా ఆదాయం పడిపోయిందిని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ అంచనాల కంటే ఎక్కువ అప్పులు చేసిన విషయం నిజమేనని చెప్పారు. కరోనా వైరస్ వల్ల రాష్ట్రానికి వచ్చే ఆదాయం పడిపోయిందని… ఇదే సమయంలో ఖర్చు బాగా పెరిగిందని తెలిపారు. ఈ పరిస్థితిని ఒక్క ఏపీ మాత్రమే ఎదుర్కోవడం లేదని… అనేక రాష్ట్రాలు ఇదే సమస్యతో ఇబ్బంది పడుతున్నాయని చెప్పారు. గత ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కరోనా నియంత్రణ కోసం ప్రతి రోజు వందల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయాల్సి వచ్చిందని అన్నారు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. డబ్బు అవసరం ఉన్నందుకే అప్పులు చేశామనే విషయాన్ని గర్వంగా చెప్పగలనని బుగ్గన అన్నారు.

తమది సంక్షేమ ప్రభుత్వమని… అందుకే ఎక్కువ మొత్తంలో డబ్బు అవసరమవుతోందని చెప్పారు. ఈ పథకాల ద్వారా అదే డబ్బును వ్యవస్థలోకి పంపుతున్నామని తెలిపారు. ప్రభుత్వ చర్యలతో రాష్ట్ర అర్థిక స్థితి మెరుగుపడుతోందని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాల వల్ల విమర్శించేందుకు ఏమీ లేక అప్పులు అంటూ విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. కర్నూలులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు తనపై తప్పుడు ప్రచారం చేశారని బుగ్గన మండిపడ్డారు. గత వంద ఏళ్లుగా తమ కుటుంబం మైనింగ్ రంగంలో ఉందని చెప్పారు. తాను ఇప్పటికీ అపార్టుమెంటులోనే ఉంటున్నానని… పాత కారునే వాడుతున్నానని తెలిపారు. చంద్రబాబు చేసిన అవినీతి ఆరోపణలపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

కోవిడ్‌ కారణంగా చాలా దేశాల్లో ఆర్థిక వ్యవస్థ తలకిందులైందని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. బడ్జెట్‌ అంచనాల కంటే ఎక్కువ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గత ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేసిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం ప్రాధాన్యత లేని ఖర్చులు చేసిందని, 2014 నాటికే ఏపీ రెవెన్యూ లోటుతో ఉందని వ్యాఖ్యానించారు. కోవిడ్‌ వల్ల రాబడి విపరీతంగా తగ్గిపోయిందని, అదేవిధంగా ఖర్చు కూడా పెరిగిందన్నారు. కోవిడ్‌ కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా సంక్షేమ పథకాలు ఆపలేదని పేర్కొన్నారు. రాష్ట్రానికి ఆదాయం లేకపోయినా ప్రజలకు సహాయంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భావించారని తెలిపారు. 2019-20 జూన్‌లో రెవెన్యూ రాబడి రూ. 3,540 కోట్లు ఉంటే 2020-21 జూన్‌లో రెవెన్యూ రాబడి రూ. 5,781 కోట్లు పెరిగిందన్నారు.

అర్థిక పరిస్థితి బాగా లేకపోవడం వల్ల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడానికి తాము అప్పులు చేశామని మంత్రి పేర్కొన్నారు. తమ సంక్షేమ పథకాలు దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా ప్రజల ఖాతాల్లోకి వెళ్తున్నాయని తెలిపారు. 2020-21 తొలి క్వార్టర్‌లో ద్రవ్యలోటు మైనస్‌ 12.9 శాతం ఉండగా.. మూడో క్వార్టర్‌ నాటికి మైనస్‌ 5.5, చివరి క్వార్టర్‌లో మైనస్‌ 3 శాతానికి తగ్గిందన్నారు. జూన్ నుంచి డిసెంబర్‌ నాటికి జీఎస్టీ పన్నుల రాబడిలో దేశంలోనే రెండో స్థానంలో ఉన్నామని పేర్కొన్నారు. రాబడి లేకపోవటడం వల్ల అప్పులు పెరగటం సహజమని, రాష్ట్రం అప్పులపాలైందనని టీడీపీ చేస్తున్న విమర్శలు అర్థరహితమని కొట్టిపారేశారు.

Read More:

విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీని అందుకే అమ్మేస్తున్నారు.. పోస్కో ప్రతినిధులతో సీఎం జగన్‌ కుమ్మక్కయ్యారు -దేవినేని ఉమా