విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీని అందుకే అమ్మేస్తున్నారు.. పోస్కో ప్రతినిధులతో సీఎం జగన్‌ కుమ్మక్కయ్యారు -దేవినేని ఉమా

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర బంద్ సంపూర్ణంగా కొనసాగింది. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఇచ్చిన పిలుపు మేరకు కొండపల్లి మున్సిపాలిటీలో..

  • K Sammaiah
  • Publish Date - 5:11 pm, Fri, 5 March 21
విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీని అందుకే అమ్మేస్తున్నారు.. పోస్కో ప్రతినిధులతో సీఎం జగన్‌ కుమ్మక్కయ్యారు -దేవినేని ఉమా

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర బంద్ సంపూర్ణంగా కొనసాగింది. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఇచ్చిన పిలుపు మేరకు కొండపల్లి మున్సిపాలిటీలో నిరసన బంద్ కార్యక్రమం లో మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొననారు. విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అనేది దశాబ్దాల నాటి నినాదం. ఎన్నో పోరాటాలు చేసి తెచ్చుకున్నా కంపెనీని సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి తాకట్టు పెట్టారని ఆయన ఆరోపించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 92 మంది బలిదానాలు చేశారు. ఎన్నో గ్రామాల త్యాగాలు ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ వెనుక ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని పోరాటాలు చేసి తెచ్చుకున్నారు.
తాడేపల్లి రాజప్రసాదం లో పోస్కో ప్రతినిధులు ముఖ్యమంత్రి గారిని కలిసారు ఏ లాలూచీ చేసుకున్నారో ప్రజలకు చెప్పాలని దేవినేని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి ఎవరికి చెప్పి ఒప్పందాలు చేసుకున్నారు ? విశాఖ కార్మికులకు చెప్పారా ? ప్రజా ప్రతినిధులకు చెప్పారా ? అని ఆయన ప్రశ్నించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు దాదాపు రూ.40 వేల కోట్లు పన్నుల రూపంలో చెల్లిస్తుంది. ఇవాళ మీ స్వార్ధం కోసం విశాఖ భూములు కొట్టేయాలి అని దుర్భుద్ధితో ముఖ్యమంత్రి గారు ఒప్పందాలు చేసుకున్నారు. 7 వేల ఎకరాలు అమ్మేస్తాను ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాసాను అని చెబుతున్నాడు ఈ ముఖ్యమంత్రి. రైతులు, ప్రజలు ఇచ్చిన భూములు అమ్మడానికి నువ్వు ఎవరవి అని దేవినేని మండిపడ్డారు.

ఒక్కసారి ఒక్కసారి అని అధికారంలోకి వచ్చి రైతులు త్యాగలతో ఆడుకుంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం చేస్తున్న బంద్ కు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ బంద్ లో పాల్గొంటుంది. గతంలో ఇలాగే కేంద్ర ప్రభుత్వం చేస్తే అప్పుడు చంద్రబాబు వాజ్ పేయ్ గారితో మాట్లాడి కాపాడుకోవడం జరిగింది. విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు పార్లమెంట్ లో కేంద్ర మంత్రి చాలా క్లియర్ గా చెప్పారు. 2019 పోస్కోతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది అని. విశాఖ ఉక్కు కోసం ఢిల్లీ లో ఎందుకు పాదయాత్ర చేయరని వైసీపీని దేవినేని ఉమా ప్రశ్నించారు.

ఇవాళ ఇష్టారాజ్యంగా నిత్యావసర ధరలు పెంచేశారు. విశాఖ ఉక్కు కోసం ఎటువంటి త్యాగలకైనా సిద్ధంగా ఉన్నాము. 28 మంది ఎంపీలు ఉండి పార్లమెంట్ లో ఎందుకు పోరాటం చేయడం లేదని నిలదీశారు. ఎన్నికల ముందు ఇంటి ఇంటికి రేషన్ తీసుకువస్తానని చెప్పి ఇవాళ నడి రోడ్డులో ప్రజలను నిలబెట్టారు. స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా పోలీసులు, రెవెన్యూ అధికారులు అధికార పార్టీ కి సహకరించారని ఆరోపించారు. ఓటర్ స్లిప్పులు 25 కట్టాల్సిన కట్టకు 28 స్లిప్పులు కట్టారు. రేషన్ బియ్యం తీసుకోవాలంటే కందిపప్పు కొనాలి, సబ్బులు కొనాలి. పంచదార కొనాలి అని చెబుతున్నారు. మీ ఇష్టారాజ్యంగా కార్యక్రమాలు చేస్తున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల తరువాత ఇంటి పన్ను, నీటి పన్ను పెంచబోతున్నారని దేవినేని చెప్పారు.

Read More:

అసత్య ప్రచారాలు చేస్తే ఇక నుంచి చెల్లదు.. ఏపీ ‘ఫ్యాక్ట్‌చెక్‌’ వేదికను ప్రారంభించిన సీఎం జగన్‌

శాసనమండలిలో పెరిగిన వైసీపీ బలం.. ఆరుగురు వైసీపీ అభ్యర్థులు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవం