West Bengal Election 2021 : 291 మంది టీఎంసీ అభ్యర్థుల జాబితా విడుదల.. నందిగ్రామ్ నుంచి బరిలో మమత బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) చీఫ్ మమతా బెనర్జీ శుక్రవారం ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పూర్తి జాబితాను ప్రకటించారు.
TMC Candidate List West Bengal Election 2021: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) చీఫ్ మమతా బెనర్జీ శుక్రవారం ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పూర్తి జాబితాను ప్రకటించారు. బెంగాల్ ఎన్నికలకు 291 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను విడుదల చేశారు. అయితే ఈసారి నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్నట్టు దీదీ స్పష్టంచేశారు. ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న భవానీపూర్ నుంచి సోవన్‌దేవ్ ఛటోపాధ్యాయ్‌ను బరిలో దించుతున్నట్టు మమతా బెనర్జీ వెల్లడించారు. ఇటీవల తృణమూల్ పార్టీకి గుడ్‌బై చెప్పి భారతీయ జనతా పార్టీలో చేరిన సువేందు అధికారి నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తానంటూ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
బెంగాల్ అసెంబ్లీలో మొత్తం 294 సీట్లు ఉండగా.. 291 స్థానాలకు తృణమూల్ కాంగ్రెస్ నుంచి అభ్యర్థులను ఖరారు చేశారు. మూడు స్థానాలను మిత్రపక్షానికి కేటాయించారు. టీఎంసి అభ్యర్థుల జాబితాలో మొత్తం 50 మంది మహిళా అభ్యర్థులు, 42 మంది ముస్లిం అభ్యర్థులు, షెడ్యూల్డ్ కులం (ఎస్సీ) నుండి 79 మంది అభ్యర్థులు, షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) అభ్యర్థుల నుండి 17 మంది ఉన్నారు. ఇదిలావుంటే, 27 మంది సిట్టింగ్ టీఎంసి ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వలేదు. అలాగే, ఈసారి 80 ఏళ్లు పైబడిన అభ్యర్థులకు టిక్కెట్లు నిరాకరించారు.
బెంగాల్‌లో ఈసారి బీజేపీ నుంచి గట్టిపోటీ ఎదురవ్వడంతో మమత ఇప్పటికే అప్రమత్తమయ్యారు. దీనికి తోడు పలువురు కీలక నేతలు పార్టీని వీడి బీజేపీలో చేరడంతో అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి వ్యవహరించి కసరత్తు చేసినట్టు సమాచారం. బెంగాల్‌లో మొత్తం ఎనిమిది విడతలుగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 27న తొలి విడత ఎన్నికలు ప్రారంభం కానుండగా.. ఏప్రిల్ 29న ఎనిమిదో దశ ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ఇదిలావుంటే, ఈ నెల 9న నందిగ్రామ్ వెళ్తానని మమతా బెనర్జీ వెల్లడించారు. 10న హల్దియాలో నామినేషన్ వేయనున్నట్టు ఆమె వెల్లడించారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతు తెలిపిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే తేజస్వీయాదవ్, అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్, ఉద్ధవ్ ఠాక్రే దీదీకి మద్దతు తెలిపారు.
full list of TMC candidates | ||
S.NO | CANDIDATE NAME | ASSEMBLY CONSTITUENCY, DISTRICT |
1 | Paresh Chandra Adhikary | Mekliganj (SC), Cooch Behar |
2 | Girindra Nath Barman | Mathabhanga (SC), Cooch Behar |
3 | Binay Krishna Barman | Coochbehar Uttar (SC), Cooch Behar |
4 | Avijit Dey Bhowmik (Hippy) | Coochbehar Dakshin, Cooch Behar |
5 | Partha Pratim Ray | Sitalkuc.hi (SC), Cooch Behar |
6 | Jagadlsn Chandra Barma Basunia | Sital (SC), Cooch Behar |
7 | Udayan Guha | Dinhata, Cooch Behar |
8 | Rabindra Nath Ghosh | Natabari, Cooch Behar |
9 | Pranab Kumar Dey (Manik) | Tufanganj, Cooch Behar |
10 | Leos Kujur | Kumargram (ST), Alipurduar |
11 | Pasang Lama | Kakhlni (ST), Alipurduar |
12 | Sourav Chakraborty | Alipurduar, Alipurduar |
13 | Subhash Ray | Falakata (SC), Alipurduar |
14 | Rajesh Takra (Tiger) | Madarihat (ST), Alipurduar |
15 | Mitali Roy | Dhupguri (SC), Jalpaiguri |
16 | Manoj Roy | Maynaguri (SC), Jalpaiguri |
17 | Dr. Pradìp Kumar Barma | Jalpaiguri (SC), Jalpaiguri |
18 | Khageswar Roy | Rajganj (SC), Jalpaiguri |
19 | Goutam Deb | Dabgram-Phulbari, Jalpaiguri |
20 | Bulu Chik Baraik | Mal (ST), Jalpaiguri |
21 | Joseph ·Munda | Nagrakata (ST), Jalpaiguri |
22 | *** | Kalimpong |
23 | *** | Darjeeling Darjeeling |
24 | *** | Kurseong Darjeeling |
25 | Captain Nalini Ranjan Ray | Matigara-Naxalbari (SC) Darjeeling |
26 | Prof. Omprakash Mishra | Siliguri, Darjeeling |
27 | Chaton Kisku | Phansidewa (ST) Darjeeling |
28 | Hamidul Rahaman | Chopra Uttar Dinajpur |
29 | Abdul Karim Chowdhury | lslampur Uttar Dinajpur |
30 | Md. Ghulam Rabbani | 30 Goalpokhar Uttar Dinajpur |
31 | Minhajul Arfin Azad | Chakulia Uttar Dinajpur |
32 | Gautam Pal | Karandighi Uttar Dinajpur |
33 | Satyajit Barman | Hemtabad (SC), Uttar Dinajpur |
34 | Tapan Deb Singha | Kaliaganj (SC), Uttar Dinajpur |
35 | Kanaia Lal Agarwal | Raiganj Uttar, Dinajpur |
36 | Rekha Roy | Kushmandi (SC) Dakshin, Dinajpur |
37 | Toraf Hossain Mandai | Kumarganj Dakshin, Dinajpur |
38 | Sekhar Dasgupta | Balurghat Dakshin, Dinajpur |
39 | Kalpana Kisku | Tapan (ST), Dakshin Dinajpur |
40 | Mosaraf Hossain | ltahar Uttar, Dinajpur |
41 | Gautam Das | Gangarampur (SC) Dakshin Dinajpur |
42 | Biplab Mitra | Harirampur Dakshin Dinajpur |
43 | Malda Sarala Murmu | Habibpur (ST) Malda |
44 | Basanti Barman | Gazole (SC), Malda |
45 | Nihar Ranjan Ghosh | Chanchal, Malda |
46 | Tajmul Hossain | Harishchandrapur Malda |
47 | Abdur Rahim Boxi | Malatipur Malda |
48 | Sarnar Mukherjee | Ratua Malda |
49 | Sabítri Mitra | Sabítri Mitra |
50 | Ujjwal Chowdhury | Maldaha (SC), Malda |
51 | Krishnendu Narayan Chowdhury | English Bazar, Malda |
52 | Sabina Yeasmin | Mothabari, Malda |
53 | Md Abdul Ghani | Suja pur, Malda |
54 | Chandana Sarkar | Baisnabnagar, Malda |
55 | Monirul Islam | Farakka, Murshidabad |
56 | Amirul Islam | Samserganj, Murshídabad |
57 | Emani Biswas | Suti, Murshidabad |
58 | Jakir Hossain | Jangipur, Murshldabad |