puducherry politics : పుదుచ్ఛేరిలో జోరందుకున్న రాజకీయం… సీఎం అభ్యర్థిత్వంపై సై అంటే సై

పుదుచ్చేరి పాలిటిక్స్‌ కాక రేపుతున్నాయి. ఎన్నికల వేళ అక్కడ రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఎవరు ఎటువైపు ఉంటారో అర్థం కాని పరిస్థితి.

puducherry politics : పుదుచ్ఛేరిలో జోరందుకున్న రాజకీయం... సీఎం అభ్యర్థిత్వంపై సై అంటే సై
Follow us

|

Updated on: Mar 05, 2021 | 4:10 PM

Puducherry politics : పుదుచ్చేరి పాలిటిక్స్‌ కాక రేపుతున్నాయి. ఎన్నికల వేళ అక్కడ రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఎవరు ఎటువైపు ఉంటారో అర్థం కాని పరిస్థితి. సీఎం అభ్యర్థిని నేనంటే నేనంటూ వారిలో వారే కొట్లాడుకుంటున్నారు. బీజేపీ, ఎన్‌ఆర్‌కాంగ్రెస్‌, ఏఐఏడీఎంకేలు కలిసి ఏర్పాటుచేసిన కూటమిలో తాజాగా లుకలుకలు బయటపడ్డాయి. సీఎం అభ్యర్థిత్వం కోసం సై అంటే సై..ఢీ అంటే ఢీ అంటున్నారు.

దేశంలో తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అసోంలతోపాటు పుదుచ్చేరీలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ముందే రాజకీయ సంక్షోభం తీవ్రమవుతోంది. ఎన్నికలు మరో రెండు నెలలుండగా.. వరుస రాజీనామాలతో అధికార కాంగ్రెస్ చేయి పూర్తిగా విరిగిపోయింది. అధినేత రాహుల్ గాంధీ పార్టీని చక్కదిద్దేందుకు వస్తున్న తరుణంలో రాజీనామాల పర్వం ఊపందుకోవడం వెనుక కుట్ర కోణం దాగి ఉందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఎన్నికలకు ముందే పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన నమశివాయను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలనే యోచనలో ఉంది బీజేపీ. అయితే, తానే ముఖ్యమంత్రి అభ్యర్థినంటూ పట్టుబడుతున్నారు ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ రంగస్వామి. కూటమిలో ఉంటూనే తమ నేతలపై కాషాయ కండువా కప్పుతున్నారని మండిపడుతున్నారు.

మరోవైపు. బీజేపీతో సీట్ల సర్దుబాటు చర్చలకు కూడా గైర్హాజరయ్యారాయన. అయితే, సందట్లో సడేమియాలా తమతో పొత్తుకు కలిసిరావాలని రంగస్వామికి గాలం వేస్తోంది డీఎంకే. తమ పార్టీ తరపున మీరే సీఎం అభ్యర్థి అంటూ.. భారీ ఆఫర్‌ కూడా ప్రకటించేసింది. ఇప్పడి రంగస్వామి ఏ నిర్ణయం తీసుకుంటారన్నాదీ ఆసక్తికరంగా మారింది. మరోవైపు, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేయాలని రంగస్వామిని అభ్యర్థించినట్లు సిట్టింగ్ పార్టీ శాసనసభ్యులు ఇకరు తెలిపారు.

బీజేపీ గతంలో ప్రభుత్వానికి నాయకత్వం వహించి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నందున కూటమి సమస్యపై స్పష్టమైన వైఖరి తీసుకోవాలని రంగస్వామిని కోరారు. నాయకుల అభిప్రాయాలను విన్న తరువాత, యు.టి.లో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ప్రజలు చూస్తారని రంగస్వామి వారితో చెప్పినట్లు తెలిసింది. మరోవైపు పుదుచ్చేరి పార్టీ వ్యవహరాలను కేంద్ర విదేశాంగ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, రాజ్యసభ సభ్యుడు రాజీవ్ చంద్రశేఖర్ దగ్గరేుండి పర్యవేక్షిస్తున్నారు.

ఇదీ చదవండిః  కేంద్రం ఐటీఐఆర్‌ ఇవ్వము అంటే అడిగే బీజేపీ నాయకుడు లేడు.. ఏ మొఖం పెట్టుకుని ఓట్లడుగుతున్నారు..?