AP Bandh: రాష్ట్రాన్ని బంద్ చేసిన బందులెన్నో.. గత ఏడేళ్ళలో ఇది ఎన్నో రాష్ట్రస్థాయి బందో తెలుసా?
చాలా కాలం తర్వాత విజయవంతమైన రాష్ట్ర బందుల్లో శుక్రవారం నాటి వైజాగ్ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన బందు ఒకటిగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పుటి వరకు పిలుపునిచ్చిన బందుల..

Andhra Pradesh State Bandh Success: చాలా కాలం తర్వాత విజయవంతమైన రాష్ట్ర బందుల్లో శుక్రవారం నాటి వైజాగ్ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన బందు ఒకటిగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పుటి వరకు పిలుపునిచ్చిన బందుల వివరాలను ఓసారి అవలోకనం చేస్తే ఆసక్తికర, ఉద్రిక్త బందులెన్నో కనిపిస్తాయి. పలు సందర్భాలలో కార్మిక సంఘాలే ఎక్కువగా బందులకు పిలుపునిస్తూ వుంటాయి. ఒకప్పుడు మావోయిస్టులు (అప్పట్లో పీపుల్స్ వార్ నక్సల్స్) బందు పిలుపునిస్తే.. ఎక్కడిక్కడ అన్నీ నిలిచిపోయేవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బందుకు పిలుపునిస్తే.. కాల్ ఇచ్చిన సంస్థలు, పార్టీలు, సంఘాలను బట్టి ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా స్పందన కనిపించేది. ఎవరు బందుకు పిలుపునిచ్చినా ఆర్టీసీ బస్సులపైనే ప్రధానంగా దృష్టి సారించడం రివాజు. ప్రస్తుత బందులోనే అదే జరిగింది. మావోయిస్టులు బందుకు పిలుపునిస్తే.. బస్సులను తగుల బెడతారన్న భయంతో ముందుగానే ఆర్టీసీ సర్వీసులను రద్దు చేసేవారు.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో గత ఆBandhరేళ్ళుగా పలుమార్లు బందులకు పిలుపునిచ్చాయి రాజకీయ పార్టీలు. 2015 ఆగస్టు 29న ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ రాష్ట్ర బంద్‌కు పిలుపు నిచ్చింది ఆనాటి విపక్షం, ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ. 2018 ఫిబ్రవరి 8వ తేదీన కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా ఏపీ బందుకు కాంగ్రెస్, వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. 2018 ఏప్రిల్ 16న రాష్ట్రబంద్‌కు పిలుపునిచ్చింది ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి. దానికి వైసీపీ, వామపక్షాలు మద్దతు ప్రకటించడంతో విజయవంతమైంది. 2018 జులై 24 ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఏపీ బంద్‌కు పిలుపు నిచ్చింది వైసీపీ. 2019 ఫిబ్రవరి 1న ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ మరోసారి రాష్ట్ర బంద్ చేపట్టింది ప్రత్యేక హోదా సాధన సమితి. దీనిలో వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ పాలుపంచుకున్నాయి. 2021 ఫిబ్రవరి 25 కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలకు నిరసనగా దేశవ్యాప్త రవాణా బంద్‌కు ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ మద్దతు ప్రకటించింది. 2021 మార్చి 5వ తేదీన విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బందుకు కార్మిక సంఘాలు పిలుపునివ్వగా.. బీజేపీ, జనసేన మినహా అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఈ బందుకు టీడీపీ మద్దతు ప్రకటించగా.. అధికార వైసీపీ కూడా సంఘీభావం ప్రకటించడం విశేషం. బందులో పాల్గొనడమేకాకుండా ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించొద్దని కోరుతూ ప్రధాని మోదీకి సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబు లేఖలు రాశారు.
ALSO READ: ఇపుడు అందరి కళ్ళు ఆయనపైనే.. ఎందుకంటే సడన్‌గా సీఎం కేండిడేట్ అయ్యాడు కదా!
ALSO READ: చిన్నమ్మ సన్యాసం వెనుక వున్నదెవరో తెలుసా?
ALSO READ: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాకరేపుతున్న ఐటీఐఆర్.. ఎవరి వాదన ఎలా వున్నా.. ఇప్పటి వరకు జరిగిందిదే!
ALSO READ: విజయవంతంగా కోవిడ్ వ్యాక్సినేషన్.. మరికొన్ని రకాల వ్యాక్సిన్లకు త్వరలో అనుమతులు