Singer Sunitha : రిసార్ట్ లో ఓ టీవీ షో షూటింగ్.. కల్లు గీత కార్మికులతో సందడి చేసిన సింగర్ సునీత

ప్రముఖ సింగర్ సునీత ప్రముఖ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న తర్వాత రోజు కో టాపిక్ తో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇటీవలే సింగర్ సునీత రెండో పెళ్లి ఘనంగా జరిగింది. రామ్ తో సింగర్ సునీత సెకండ్ లైఫ్ ను అద్భుతంగా లీడ్ చేస్తున్నారు. ఇటీవల ఓ మీడియా ఛానెల్..

  • Surya Kala
  • Publish Date - 1:58 pm, Fri, 5 March 21
Singer Sunitha  : రిసార్ట్ లో ఓ టీవీ షో షూటింగ్..  కల్లు గీత కార్మికులతో సందడి చేసిన సింగర్ సునీత

Singer Sunitha : ప్రముఖ సింగర్ సునీత ప్రముఖ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న తర్వాత రోజు కో టాపిక్ తో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇటీవలే సింగర్ సునీత రెండో పెళ్లి ఘనంగా జరిగింది. సునీత పెళ్లి టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సునీతా రామ్ వీరపనేని దంపతులు తాము ఈ పెళ్లి తో ఎంతో సంతోషంగా ఉన్నామని చెప్పారు.. కొన్ని వందల కోట్లకు అధిపతి అయిన రామ్ తో సింగర్ సునీత సెకండ్ లైఫ్ ను అద్భుతంగా లీడ్ చేస్తున్నారు. ఇటీవల ఓ మీడియా ఛానెల్ వారు ఉమెన్స్ డే స్పెషల్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తూ సునీతను పిలిచినట్లు తెలుస్తోంది. ఈ ప్రోగ్రాం కోసం సునీతను గెస్ట్ గా తీసుకువస్తున్నారు టీవీ నిర్వాహకులు. అయితే సునీత ప్రగతి రిసార్టులో కల్లు తాగుతున్నట్లు ఓ సీన్ చేసిన సందర్భం వచ్చినట్లు తెలుస్తోంది. ఆ రిసార్ట్ లో తాటిచెట్లు ఉండడం.. గీత కార్మికులతో పాటు తోటి కళాకారులతో కలిసి సునీత సిప్ చేసినట్లు యాక్ట్ చేయగా ఆ ఫోటో ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

సునీత తన ఇద్దరు పిల్లలను ఒక్కరే పెంచి పెద్దచేశారు. ఈ క్రమంలోనే రామ్ పరిచయం అయ్యాడట. అయితే.. అప్పుడప్పుడూ రామ్ తో ఫోన్లో మాట్లాడేదాన్నని చెప్పిన సునీత.. ఆయన తరచూ ‘ఇంకేంటీ..?’ అని అడిగేవాడని చెప్పింది. అయితే.. ఆ మాటల్లో అర్థాన్ని అప్పుడు గుర్తించలేకపోయానని సునీత చెప్పారు.

ఆ తర్వాత అసలు విషయం గుర్తించి ఫోన్ లిఫ్ట్ చేసేదాన్ని కాదని కూడా తెలిపింది. అందుకు కారణం.. అసలు తనకు పెళ్లంటేనే ఇష్టం లేకపోవడమేనని చెప్పింది సునీత. ఆ తర్వాత లాక్ డౌన్ లో ఏదో జరిగిందన్న సింగర్.. రామ్ ఫోన్ చేసి ఫోన్లోనే పెళ్లి గురించి ప్రపోజ్ చేశారని వెల్లడించింది. ఆ తర్వాత పిల్లలతోపాటు కుటుంబ పెద్దల సమక్షంలో జనవరి 9న పెళ్లిచేసుకుంది జంట

 

Also Read: