AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood Top Hero Son: ఈ టాలీవుడ్ టాప్ హీరో తనయుడు ఎవరో గుర్తుపట్టగలరా..? ఎనీ గెస్…?

నందమూరి బాలకృష్ణ.. తెలుగు చిత్రసీమలో అన్న ఎన్టీఆర్ నటవారసత్వాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. ఆ ఫ్యామిలీ మూడవతరం హీరో చిన్న తారకరామారావు కూడా తాతకు తగ్గ తనయుడిగా రాణిస్తూ ముందుకు సాగుతున్నారు.

Tollywood Top Hero Son: ఈ టాలీవుడ్ టాప్ హీరో తనయుడు ఎవరో గుర్తుపట్టగలరా..? ఎనీ గెస్...?
Ram Naramaneni
|

Updated on: Mar 05, 2021 | 7:44 PM

Share

నందమూరి బాలకృష్ణ.. తెలుగు చిత్రసీమలో అన్న ఎన్టీఆర్ నటవారసత్వాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. ఆ ఫ్యామిలీ మూడవతరం హీరో చిన్న తారకరామారావు కూడా తాతకు తగ్గ తనయుడిగా రాణిస్తూ ముందుకు సాగుతున్నారు. నందమూరి హీరోలలో ముఖ్యంగా చెప్పాలంటే వీరిద్దరే మంచి ప్రాచూర్యంలో ఉన్నారు. కాగా నందమూరి బాలయ్య తనయుడు మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తారు. ఇది అభిమానుల మనసుల్లో మెదులుతున్న ప్రశ్న. ఇప్పటికే ఎన్నో ప్రచారాలు జరిగినా అవి మాత్రం కార్యరూపం దాల్చలేదు. ప్రముఖ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను అతడిని లాంచ్ చేయబోతున్నట్లు చెప్పారు. కానీ అది కూడా ముందుకు వెళ్లలేదు. కాగా ఈ క్రమంలోనే మోక్షజ్ఞకు సినిమాలపై ఇంట్రస్ట్ లేదని, అతడు బిజినెస్ వైపు అడుగులు వేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఫ్యాన్స్ గందరగోళంలో పడ్డారు

గతేడాది బాలయ్య తన 60వ బర్త్ డే సందర్భంగా పలు చానెల్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలలో త్వరలోనే మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు చెప్పుకొచ్చాడు. ఆయన కోసం దర్శకులు స్టోరీలు కూడా సిద్దం చేస్తున్నట్లు ప్రస్తావించాడు. ఇక ఈ ఏడాది మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ పక్కా అని అభిమానులు ఫిక్స్ అయ్యారు. ప్రముఖంగా టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మోక్షూను లాంచ్ చేయబోతున్నారని సమాచారం. ఈ సినిమాను బాలకృష్ణ 61వ పుట్టినరోజున ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది.  ఈ చిత్రాన్ని వారాహీ చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మించే అవకాశాలున్నాయి. ఈ మ‌ధ్యే 23వ ఏట అడుగుపెట్టాడు మోక్షు. ఎంట్రీకి ఇదే సరైన సమయమని భావించవచ్చు.

కాగా మోక్షజ్ఞ పిక్ ఒకటి తెగ సర్కులేట్ అవుతుంది. ఈ ఉదయం నారా, నందమూరి కుటుంబాల వంశాంకురాలు దేవాన్ష్, ఆర్యవీర్ ల అక్షరాభ్యాసం బాసరలో వైభవంగా జరిగింది. బాలయ్య పెద్ద కుమార్తె బ్రాహ్మణి, టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ దంపతుల కుమారుడు దేవాన్ష్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఆర్యవీర్ బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని కుమారుడు. ఈ కార్యక్రమంలో బ్లింక్ అయిన మోక్షజ్ఞ పిక్‌ను నందమూరి అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. మాములుగా మోక్షజ్ఞ పెద్దగా బయట కనిపించరు. అతడి ఫోటోలు కూడా బయటకు రావు.  దీంతో ఇప్పుడు ఈ పిక్ తెగ వైరల్‌గా మారింది.

Nandamuri-Balakrishna-Son-

Also Read:

ఏపీ మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై నాన్​‌బెయిలబుల్ వారెంట్‌