ఒకే ఒక్క డైలాగ్.. కానీ టీజర్ మాత్రం తెగ వైరల్.. ఈ ‘ఆకాశవాణి’పై మీరు ఓ లుక్కేశారా..?

Akashavaani Movie Teaser: దర్శకదీరుడు రాజమౌళి వద్ధ సహాయకుడిగా పనిచేసిన అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఆకాశవాణి’. ఈ చిత్రంతో

ఒకే ఒక్క డైలాగ్.. కానీ టీజర్ మాత్రం తెగ వైరల్.. ఈ 'ఆకాశవాణి'పై మీరు ఓ లుక్కేశారా..?
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 05, 2021 | 5:11 PM

Akashavaani Movie Teaser: దర్శకదీరుడు రాజమౌళి వద్ధ సహాయకుడిగా పనిచేసిన అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఆకాశవాణి’. ఈ చిత్రంతో ఎం.ఎం కీరవాణి తనయుడు కాలభైరవ సంగీత దర్శకుడిగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమా టీజర్‏ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఇక టీజర్ వీడియోలో.. ప్రారంభం నుంచి డైలాగ్స్ లేకుండా.. కేవలం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‏తోనే ఆకట్టుకుంటుంది. అడవి బిడ్డల జీవనం.. వారి వ్యథలను కళ్ళకు కట్టినట్లుగా చూపించబోతున్నట్లుగా టీజర్‏లోనే హింట్ ఇచ్చేశాడు దర్శకుడు.

రాత్రిళ్లు కరెంట్ లేకుండా.. కాగడాలు పట్టుకుని జీవించడం వారి పరిస్థితి. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన సముద్రఖని.. “అంత బాగున్న ఇక్కడేదో తప్పు జరుగుతుంది శీను” అన్న డైలాగ్ ఒక్కటే ఉంది. ఇక మర్రిచెట్టు ఊడలను పట్టుకుని ఊయలూగుతున్న బాలుడు.. ఎదురుగా ఉన్న మరో ఊడకు రేడియో తగిలించడం చూస్తుంటే తెలియని అనుభూతిని కలిగిస్తోంది. తాజాగా విడుదలైన టీజర్‏తో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అటు దర్శకదీరుడు రాజమౌళి తన శిష్యుడిపై ప్రశంసలు కురింపించాడు. ఇక ట్రైలర్‏తో కనిపించిన విజువల్స్, మ్యూజిక్ ప్రేక్షకులకు సరికొత్త భావాన్ని కలిగిస్తున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వింటుంటే.. ఇక సినిమాలో మ్యూజిక్ ఎలా ఉంటుందో అనే ఆసక్తిని కలిగించాడు అశ్విన్. “ఆ విజువల్స్‌ , మ్యూజిక్‌ ఎంతో కొత్తగా ఉన్నాయి‌. ఈ సినిమాతో అశ్విన్‌ ఎలాంటి మ్యాజిక్‌ చేస్తాడా అని ఆతృతగా ఎదురు చూస్తున్నా” అని తన ట్విట్టర్ ఖాతాలో చెప్పుకోచ్చాడు రాజమౌళి. ఈ చిత్రాన్ని పద్మనాభరెడ్డి నిర్మిస్తుండగా.. బుర్రా సాయి మాధవ్ మాటలు అందిస్తున్నాడు.

Also Read:

బిగ్‏బాస్ విన్నర్ అభిజీత్‏కు లక్కీ ఛాన్స్.. ఒకేసారి మూడు సినిమాల్లో ఛాన్స్ ఇచ్చేసిన స్టార్ హీరో..

భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు
రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్
రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్